ప్రభాస్ అంటే ఇష్టం..ముద్దు ఇస్తాః తమన్నా

621
Tamannaah
- Advertisement -

సీనియర్ హీరోయిన్ తమన్నా ప్రస్తుతం పలు సినిమాల్లో బిజీగా ఉంది. తెలుగు, తమిళ్, కన్నడతో పాటు పలు హిందీ సినిమాల్లో కూడా నటిస్తుంది. గత కొద్ది రోజులుగా తమన్నా పెళ్లిపై సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు వస్తున్నాయి. తమ కూతురికి పెళ్లి సంబంధాలు చూస్తున్నామని తమన్నా తల్లి కూడా చెప్పింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది తమన్నా.

prabhas Tamanaha

మీకు స్వయంవరం ఏర్పాటు చేస్తే అందులో ఏ హీరోలు ఉండాలని కోరుకుంటారు అని అడగ్గా.. ప్రభాస్, విక్కీ కౌశల్, హృతిక్ రోషన్ తప్పకుండా ఉండాలని కోరుకుంటానని వెల్లడించింది. ఈ ముగ్గురూ తన అభిమాన హీరోలని తెలిపింది. కాగా తమన్నా ఇప్పటివరకు ఏ సినిమాలో కూడా ముద్దు సీన్లలో నటించలేదు. తమన్నా సినిమా ఒప్పుకునే ముందే ఈ ఒప్పందం కుదుర్చుకుంటుందట. అయితే హృతిక్ కోసం నో కిస్ ఒప్పందాన్ని పక్కన పెడతానని చెప్పింది.కాగా ప్రభాస్ తమన్నాలు కలిసి బాహుబలి సినిమాలో నటించారు.

- Advertisement -