రాజమౌళి సినిమాలు ఇకపై చేయదట..!

262
Tamannaah break silence on Baahubali 2
- Advertisement -

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళితో చేయడం అంటే హీరోయిన్లకు ప్రమోషన్‌ వచ్చినట్టే. అందుకే జక్కన్న సినిమాలో ఒక్క అవకాశం కోసం  ఎంతోమంది హీరోయిన్లు ఎదురుచూస్తుంటారు. బాహుబలితో ఆ అవకాశాన్ని దక్కించుకున్న మిల్కీ బ్యూటీ ఈ సినిమాలో అవంతిక పాత్రలో ఒదిగిపోయింది. దీంతో సెకండ్ పార్ట్ బాహుబలి ది కన్‌క్లూజన్‌లో తమన్న పాత్ర ఎలా ఉండబోతుందోనని అంతా ఎదురుచూశారు. ఇలాంటి వారికి నిరాశనే మిగిలిస్తూ కేవలం క్లైమాక్స్‌ సీన్‌కే అవంతిక పరిమితం చేశాడు రాజమౌళి.

దీంతో ఫ్యాన్స్‌తో పాటు తమన్నా కూడా తెగ ఫీలయిందట. అందుకే ఇంకోసారి  రాజమౌళి సినిమాలో నటించకూడదని నిర్ణయించుకుని ఇదే విషయాన్ని స్నేహితులకు చెప్పిందట. అయితే స్నేహితులు మాత్రం అలాంటి పని చేయొద్దని 100 సినిమాల్లో నటించినా రాని గుర్తింపు ఒక్క రాజమౌళి సినిమాలో ఒక్క దాంట్లో నటించినా ఆ క్రేజ్ వేరని చెప్పారట. అయితే అందుకు తమన్నా ఏ మాత్రం ఒప్పుకోలేదు. ఈ మధ్య కాలంలో రాజమౌళి ఫోన్ చేస్తే మాట్లాడనని ముఖం మీద చెప్పేసిందట.

బాహుబలి 2 ప్రమోషన్స్‌లో కూడా తమన్నా ఎక్కడా కనిపించలేదు.  బాహుబలి-2లో ఎక్కువసేపు తనను చూపించాలని రాజమౌళిని చూపించమని కోరితే అది సాధ్యంకాదని ఆయన చెప్పారట. అందుకే  ప్రమోషన్‌కు పూర్తిగా దూరమై పోయిందట. అయితే అప్పట్లో ఈ విషయంపై తమన్నాను మాట్లాడిస్తే నేను సినిమాల్లో బిజీగా ఉన్నాను. సినిమా ప్రమోషన్స్‌కు వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పి తప్పించుకున్నా అసలు కారణం తెలిసిన తమ్మూ  ప్యాన్స్ నోరేళ్ల బెడుతున్నారట.

- Advertisement -