స్పైడర్ …. రివ్యూ

247
- Advertisement -

ప్రిన్స్ మహేశ్‌బాబు, ప్రముఖ దర్శకుడు మురుగదాస్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం స్పైడర్. రేపు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు ముందే భారీ హైప్‌ను క్రియేట్ చేస్తూ రికార్డుల దిశగా దూసుకెళ్తోంది స్పైడర్. బాహుబలి చిత్రం తర్వాత అత్యధిక స్క్రీన్లలో రిలీజ్ కానున్న చిత్రంగా స్పైడర్ ఓ రికార్డును సొంతం చేసుకొన్నది. అమెరికాలో స్పైడర్ చిత్రం సుమారు 300 స్కీన్లలో విడుదలవుతున్నట్టు సమాచారం.

ఈ నేపథ్యంలో సినిమాల విడుదలకు ముందే వాటి రివ్యూ, రేటింగ్స్ చెప్పేసే విదేశీ సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమైర్ సంధు స్పైడర్ మూవీ రేటింగ్ ఇచ్చేశాడు. స్పైడర్ అద్భుతంగా ఉందని ప్రశంసించిన ఆయన 3.5 రేటింగ్ అంచనాలను మరింతగా పెంచేశాడు.

కనిపించకుండా ఘోరాలు చేసే విలన్ ను కనిపెట్టి, ఆట కట్టించే పాత్రలో మహేష్ నటన అద్భుతమని అన్నారు. విలన్ ఎవరో కనిపెట్టేందుకు వేసే ఎత్తులు, పై ఎత్తులు అలరిస్తాయని చెప్పారు. చిత్రంలో క్లైమాక్స్ అత్యుత్తమమని, ప్రతి ఒక్కరినీ మెస్మరైజ్ చేస్తుందని చెప్పారు. అటు క్లాస్ ను, ఇటు మాస్ ను అలరించే విధంగా తయారైన ‘స్పైడర్’, ఈ దసరాకు బ్లాక్ బస్టరేనని తేల్చారు.

spyder review

- Advertisement -