ఆ హీరోతో డేట్ కి వెళ్తా అంటున్న మిల్కి బ్యూటీ

261
Tamannaha Vikky Koushal
- Advertisement -

మిల్కి బ్యూటీ తమన్నా వరుస ఆఫర్లతో బిజిగా ఉంది. ప్రస్తుతం తెలుగు, తమిళ్, హిందీ సినిమాల్లో తమన్నా నటిస్తుంది. తెలుగులో వెంకటేశ్ సరసన ఎఫ్ 2 సినిమాలో నటించి మంచి విజయాన్ని అందుకుంది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సైరా నరసింహారెడ్డితో పాటు తమిళ్ లో ప్రభుదేవా సరసన దేవి2 సినిమాలో నటిస్తుంది. తాజాగా ఓ ఇంటర్యూలో పాల్గోన్న తమన్నా పలు ఆసక్తికర విషయాలు తెలిపింది. డేటింగ్ కి వెళ్లే అవకాశం వస్తే ఎవరితో వెళ్తారు అని పశ్నించగా వెంటనే బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ పేరు చెప్పింది.

ఈమధ్య కాలంలో విక్కీ కౌశల్ బాలీవుడ్ లో బాగా పాపులర్ అయ్యాడు. ఇటివలే అతను నటించిన ‘ఉరి: సర్జికల్ స్ట్రైక్స్’ భారీ విజయాలను సాధించాయి. ఈమూవీలో తన నటనతో అందరిని ఆకట్టుకున్నాడు. తను అంటే చాలా ఇష్టం అని తెలిపింది తమన్నా. ఆ తర్వాత మిటూ ఉద్యమం గురించి అడగ్గా..ఎవరెవరో ఏవేవో ఆరోపణలు చేస్తుంటారని, కేవలం తమకు ఎదురైన అనుభవాల గురించి చర్చించుకోవడానికే మీటూ ఉద్యమం ఉందని చెప్పింది. మిటూ గురించి మాట్లాడాలంటే చాలా ధైర్యం కావాలని తెలిపింది. ఇండస్ట్రీ నాకు అలాంటి అనుభవాలు ఎదురుకాలేదని చెప్పింది.

- Advertisement -