ఇక ఆపుతారా?… ఘాటు రిప్లై ఇచ్చిన తమన్నా

276
Actress-Tamanna-Marriage
- Advertisement -

మిల్క్‌ బ్యూటీ తమన్నా త్వరలో పెళ్లి పీటలెక్కబోతోందని గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలపై తమన్నా స్పందించింది. తన పెళ్లిపై సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం జరుగుతోందని ట్విట్టర్‌లో తెలిపింది.

tamannaah-bhatia

తన పెళ్లి ఒకరోజు యాక్టర్‌తో, మరోరోజు క్రికెటర్‌తో, మరోసారి డాక్టర్‌తో అంటూ రూమర్లు క్రియేట్‌ చేస్తున్నారని, భర్తను వెతుక్కొనే పనిలో తాను లేనని, సినిమాలతో చాలా బిజీగా ఉన్నానని, తన జీవితానికి సంబంధించిన ఎటువంటి అసత్య ప్రచారాలు చేసిన తాను అంగీకరించనని, ప్రస్తుతం తాను సింగిల్‌ గా సంతోషంగా ఉన్నానని, తాను పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడు తనే స్వయంగా తెలియజేస్తానని అప్పటి వరకు తన గురించి ఎటువంటి అసత్య ప్రచారాలు చేయవద్దని ఆమె మరోసారి విజ్ఞప్తి చేసింది. ప్ర‌స్తుతం ఎఫ్ 2 అనే మ‌ల్టీ స్టార‌ర్ లో వెంకీ స‌ర‌స‌న న‌టిస్తుంది త‌మన్నా . దీంతో పాటు కునాల్ కోహ్లి డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కుతున్న సినిమాతో పాటు మెగాస్టార్‌ చిరంజీవి సైరా, హిందీలో ఖామోషి, త‌మిళ్‌లో క‌న్నె క‌లైమాని అనే సినిమాలు చేస్తుంది.

- Advertisement -