తమన్నా డబ్బు కోసమెగా ఇలా ?

57
- Advertisement -

మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పుడు తన ప్రాధాన్యాలు మార్చుకొంది. కేవలం డబ్బు వెనకేసుకోవాలని తమన్నా ప్రస్తుతం ఆరాట పడుతుంది. అందుకే వరుసగా ప్రాజెక్ట్స్ ఒప్పుకొంటోంది. రెండేళ్ల క్రితమే తమన్నా ఫేడ్ అవుట్ స్టేజ్ కి వెళ్ళిపోయింది. అందుకే, వచ్చిన సినిమాలన్నీ చేస్తోంది. ఆమెకిప్పుడు 34 ఏళ్ళు. హీరోయిన్ గా ఆమెకి ఇంకా రెండు, మూడేళ్ళ కంటే పెద్దగా కెరీర్ ఉండదు. ఎలాగూ వెబ్ సిరీస్ లు, సినిమాలు కారణంగా తమన్నా ఇండియా అంతా పాపులర్ అయింది. అందుకే, ఈ 3, 4 ఏళ్ల టైంలోనే వీలైనన్ని ప్రాజెక్ట్స్ చేసి సంపాదించుకోవాలనేది తమన్నా ప్లాన్.

పైగా మిల్కీ బ్యూటీా, నటుడు విజయ్ వర్మతో సాగిస్తున్న ప్రేమ కుచ్ కుచ్ వ్యవహారం నిత్యం వార్తల్లో నానుతూనే ఉంది. ఈ పుకార్లు చెలరేగే కొద్దీ, ఆమె గ్రాఫ్ పడిపోతూ ఉంటుంది. కాబట్టి.. ఏం చేసినా త్వరగా చేసేయాలి. ఇదే పాయింట్ ను మైండ్ లో పెట్టుకుంది తమన్నా. పైగా హీరోయిన్ గా సినిమాలు చేస్తున్నప్పుడే బ్రాండ్స్, ఇన్ స్టాగ్రామ్ ఇతర ఆదాయం ఎక్కువ వస్తుంది. హీరోయిన్ గా కాకుండా రెగ్యులర్ పాత్రలు చేస్తే అంత ఆదాయం ఉండదు. అందుకే, తమన్నా ఇప్పుడు సంపాదనపై దృష్టి పెట్టింది. బ్రాండ్స్ నుంచి యాడ్స్ రావడానికి ప్రత్యేకంగా ఓ మేనేజర్ ను కూడా పెట్టుకుంది. అందుకే ఆమెకు ఈ మధ్య యాడ్స్ బాగా పెరిగాయి.

Also Read:శృంగార సన్నివేశాలపై కాజల్ ఆసక్తి

అన్నిటికీ మించి తమన్నా వెబ్ సిరీస్ ల్లో కూడా నటిస్తోంది. తాజాగా “జీ కర్దా” అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఈ సిరీస్ లో తమన్నా లావణ్య అనే పాత్రలో నటించింది. పైగా ఈ సిరీస్ కోసం కొన్ని సెమీ న్యూడ్ గా కొన్ని బెడ్ సీన్లు కూడా చేసింది. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. డబ్బు వస్తోంది అంటే ఏమైనా చేస్తావా తమన్నా అంటూ నెటిజన్స్ ఆమె పై విరుచుకు పడుతున్నారు. ఏది ఏమైనా తమన్నా మాత్రం చాలా కూల్ గా తన పని తానూ చేసుకుంటూ పోతుంది.

- Advertisement -