ఎన్టీఆర్ బయోపిక్‌…జయప్రదగా మిల్కీబ్యూటీ..!

378
tamanna jayapradha
- Advertisement -

నందమూరి బాలకృష్ణ -క్రిష్ కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ఎన్టీఆర్. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఓ వైపు సినిమా షూటింగ్ జరుగుతుండగానే చిత్ర ప్రమోషన్‌లో బిజీగా ఉంది ఎన్టీఆర్ టీం.

తెలుగు ప్రేక్షకుల అభిమాన నటుడిగా అలరించిన ఎన్టీఆర్ ఆ తర్వాత ఆరాధ్య నాయకుడిగా మారాడు. ఎన్టీఆర్ జీవితం చాలా మంది ప్రముఖులతో ముడిపడి ఉంది. తాజాగా ఈ చిత్రంలో మరో కీలక పాత్రలో మిల్కీ బ్యూటీ తమన్నా నటించనుంది. జయప్రద పాత్రలో నటించడానికి తమన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.

rakul preet

ఇక ఈ సినిమాలో శ్రీదేవిగా రకుల్ కనిపించనుంది. ఎన్టీఆర్ హిట్ సినిమాల్లో ఒకటైన వేటగాడు మూవీలోని ఆకు చాటు పిందె తడితే సాంగ్‌ని ఈ సినిమాలో రిమేక్ చేయనున్నారు. సినిమాకు హైలైట్‌గా ఈ సాంగ్‌ నిలవనుందట. ఎన్టీఆర్ సినీరంగ విశేషాలతో  జనవరి 9న ఎన్టీఆర్ కథానాయకుడు , రాజకీయ విశేషాలతో ఎన్టీఆర్ మహానాయకుడుగా జనవరి 24న సంక్రాంతికి ముందుకురానుంది.

ఎన్టీఆర్ స‌తీమ‌ణి బ‌స‌వ‌తార‌కం పాత్ర‌లో విద్యా బాల‌న్ ,ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాత్రలో రానా , ఆయన భార్య భువనేశ్వరి పాత్రలో మలయాళనటి మంజిమా మోహన్ నటిస్తున్నట్టు తెలుస్తుంది. అక్కినేని నాగేశ్వరరావుగా సుమంత్ , హెచ్ఎమ్ రెడ్డి కోసం సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ, దగ్గుబాటి వెంకటేశ్వరరావుగా భరత్ రెడ్డి , ఎన్టీఆర్ కూతురు పురందేశ్వ‌రిగా హిమాన్సీ నటిస్తున్నారు. ఎస్వీఆర్ పాత్ర కోసం మెగా బ్రదర్ నాగబాబు నటిస్తున్నారు.

- Advertisement -