మిల్కీ బ్యూటీ తమన్నా, నటుడు విజయ్ వర్మ మధ్య ప్రేమ వ్యవహారం పై ఎప్పటికప్పుడు పుకార్లు వస్తూనే ఉన్నాయి. ఐతే, ఇన్నాళ్లు తమన్నా వాటిని ‘ఖండించింది’. ఐతే, తమన్నా తన ఘాటు ప్రేమ పై నిజం చెప్పేసింది. తాజాగా తన ప్రేమ వార్తలపై తమన్నా స్పందిస్తూ.. ‘లస్ట్ స్టోరీస్-2 టైంలోనే విజయ్ వర్మ – నేను బాగా క్లోజ్ అయ్యాము. తోటి నటుడు అని విజయ్ ని ఇష్టపడలేదు. విజయ్ చాలా స్పెషల్. అతడు నాకు రక్షణగా నిలబడతాడనే నమ్మకం ఉంది. మా మధ్య మంచి బంధం ఉంది. అతను ప్రస్తుతానికి నా హ్యాపీ ప్లేస్’ అని తమన్నా చెప్పుకొచ్చింది.
ఐతే ఉన్నట్టుండి, తమన్నా మళ్ళీ వివరణల కార్యక్రమం ఎందుకు మొదలుపెట్టింది ? అంటూ నెటిజన్లు కామెంట్స్ మొదలు పెట్టారు. అసలు విజయ్ వర్మ – తమన్నా డేటింగ్ ఎప్పటి నుంచో నడుస్తోంది. నిజానికి తమన్నా కాస్త కమర్షియల్ గా ఉంటుంది. విజయ్ వర్మ పెద్దగా ఆస్తిపరుడు కూడా కాదు. విజయ్ వర్మ బ్యాంక్ బ్యాలెన్స్ లో మ్యాటర్ లేకపోయినా.. మరి ఎందుకు విజయ్ వర్మను ఎందుకు ప్రేమించింది అని టాక్ నడుస్తోంది. ఇంతకీ, విజయ్ వర్మను తమన్నా పెళ్లి చేసుకుంటుందా ? లేదా ? అనేది చూడాలి.
Also Read:ఛాతీలో మంట వస్తోందా..?