Tamanna:పెళ్లి పై తమన్నా మౌనమేలా?

40
- Advertisement -

మిల్కీ బ్యూటీ తమన్నా, నటుడు విజయ్ వర్మ మధ్య ప్రేమ వ్యవహారం పై ఎప్పటికప్పుడు పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఐతే 2022లో తమన్నా తన ప్రేమ విషయాన్ని పబ్లిక్ గా బయటపెట్టింది. అప్పటి నుంచి వీరి పెళ్లి గురించి చాలా కథనాలు వచ్చాయి. కానీ, ఏడాదిన్నర తర్వాత ఆ ఊసే ఎత్తడం లేదు ఈ భామ. అలాగనీ, విజయ్ వర్మతో బ్రేకప్ కాలేదు. కానీ, ఎందుకో ఈ భామ పెళ్లి గురించి ఇప్పుడు ప్రస్తావన తేవడం లేదు. నటిగా కూడా బిజీగా లేదు. ప్రస్తుతం బాలీవుడ్ లో ఒకే ఒక్క చిత్రం సెట్స్ పై ఉంది. మిగతావన్నీ విడుదలయి పోయాయి.

దీంతో, ఆమె ప్లానింగ్ ఏంటో అర్థం కావడం లేదు అంటున్నారు సినీ జనం. ప్రస్తుతం తమన్నా తన సోషల్ మీడియాలో ఎక్కువగా ఫోటో షూట్ లు అప్డేట్ చేస్తూ హడావిడి చేస్తుంది. సినిమాల అప్డేట్స్ తగ్గిపోయాయి. ఇక తెలుగులో ఐతే కొత్తగా ఆఫర్లే రావడం లేదు. ఆమె బాయ్ ఫ్రెండ్ కూడా హీరోగా సినిమాలు చెయ్యడం లేదు. నటుడిగా సినిమాలు పెద్దగా లేవు. అతను ఖాళీనే. మరి, ఇద్దరూ పెళ్లి ఊసు ఎందుకు ఎత్తడం లేదు ?, అదేమీ అంటే.. తామిద్దరం వెబ్ సిరీస్ ల్లో ఫుల్ బిజీగా ఉన్నాం అంటూ తమన్నా – విజయ్ వర్మ చెబుతున్నారు.

సరే, కెరీర్ గురించి ఎంత చెబుతున్నా.. పెళ్లి మాటే ఎత్తడం లేదు. అసలు విజయ్ వర్మ – తమన్నా డేటింగ్ ఎప్పటి నుంచో నడుస్తోంది. నిజానికి తమన్నా కాస్త కమర్షియల్ గా ఉంటుంది. విజయ్ వర్మ పెద్దగా ఆస్తిపరుడు కూడా కాదు. విజయ్ వర్మ బ్యాంక్ బ్యాలెన్స్ లో మ్యాటర్ లేకపోయినా.. మరి ఎందుకు విజయ్ వర్మను ఎందుకు ప్రేమించింది అని తమన్నా ఫ్యాన్స్ ఎన్నో ప్రశ్నలు అడుగుతున్నారు. మరి ఈ ప్రశ్నల్లో మ్యాటర్ ఉందని తమన్నా గ్రహించిందా ?, అందుకే, విజయవర్మతో పెళ్లి పై తమన్నా సైలెంట్ గా ఉంటుందా ? చూడాలి మరి ఏం జరుగుతుందో !!.

Also Read:కాంగ్రెస్‌లోకి షర్మిల..ముహుర్తం ఫిక్స్

- Advertisement -