దేశం గర్వించే స్ధితిలో గాంధీ ఆస్పత్రి: తలసాని

154
talasani
- Advertisement -

సంవత్సరం నుంచి కరోనాకు ట్రీట్మెంట్ ఇస్తున్న గాంధీ ఆస్పత్రి సిబ్బందికి సన్మానం కార్యక్రమం జరుగగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి ఈటల రాజేందర్,మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఈ సందర్భంగా మాట్లాడిన తలసాని…నేటికి కోవిడ్ కేసు నమోదై ఏడాది పూర్తి చేసుకుంది..గాంధీ హాస్పిటల్ లో డాక్టర్లు, సిబ్బంది చేసిన కృషి అభినందనీయం అన్నారు.

గాంధీ హాస్పిటల్ మొండా మార్కెట్ పరిసరాల్లో ఉన్నప్పుడు ఒకవైపు మార్చరీ ,పక్కనే మార్కెట్ ,రైల్వే స్టేషన్ ఉన్నప్పుడు తీవ్ర ఇబ్బందులు ఉండేవని….ఆరోజు నేను ప్రభుత్వం లో ఉన్నప్పుడు ఇక్కడ గాంధీ హాస్పిటల్ కట్టాలని క్యాబినెట్ లో చర్చించడం జరిగిందన్నారు. ఇక్కడ కమెర్షియల్ అవసరం లేదని గాంధీ హాస్పిటల్ లోనే మెడికల్ కాలేజి ఉండడం మంచి పరిణామం అన్నారు. ప్రజలు ,ప్రభుత్వం భయపడుతున్న సమయంలో మీరు చేసిన సేవను చరిత్ర మరిచిపోదన్నారు.

మంత్రి ఈటెల రాజేందర్ సూచనల మేరకు ఆరోజు గాంధీని పూర్తిగా కోవిడ్ హాస్పిటల్ గా ప్రభుత్వం మార్చింది….ఇక్కడ 35 వేల మంది కోవిడ్ రోగులకు చికిత్స అందించారని తెలిపారు. ఇక్కడ చిన్న విషయాలను కూడా కొంతమంది ఇబ్బంది పెట్టాలని చూశారు….రాబోయే కాలంలో మంత్రి ఈటెల రాజేందర్ సమక్షంలో గాంధీ హాస్పిటల్ ని మరింత ముందుకు తీసుకెళ్తామన్నారు. గాంధీ హాస్పిటల్ దేశమే గర్వించదగిన విధంగా తయారైంది….గాంధీలో ఉన్నటువంటి ఐసీయూ ఏ కార్పొరేట్ హాస్పిటల్ లో కూడా లేదన్నారు. నా ప్రాణానికన్నా ఎక్కువ కష్టపడి కోట్లాడి గాంధీ హాస్పిటల్ తీసుకువచ్చానని చెప్పారు.

- Advertisement -