కులవృత్తులను ఆర్ధికంగా బలోపేతం చేస్తున్నఘనత సీఎం కేసీఆర్‌దే అన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో యాదవ సంఘం భవన నిర్మాణానికి భూమి పూజ చేసి, పలువురు లబ్ధిదారులకు గొర్రెలు,పాడి ఆవులు,బర్రెలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన తలసాని…దేశంలో ఎక్కడా లేనివిధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు అవుతున్న రాష్ట్రం తెలంగాణ అన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షనాయకులు కళ్ళుండీ చూడలేని కబోదుల్లా నటిస్తున్నారని చెప్పారు.
కాలేశ్వరం ప్రాజెక్టు తరహాలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేసేందుకు సీఎం కేసీఆర్ కృతనిశ్చయంతో ఉన్నారని చెప్పారు. అచ్చంపేట నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తానని చెప్పారు.
Minister talasani srinivas yadav for Acchampet development..Minister talasani srinivas yadav for Acchampet development..