కంగనా ‘తలైవి’లో యంగ్‌టైగర్‌..?

689
ntr
- Advertisement -

టాలీవుడ్‌ స్టార్ హీరోలలో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌కు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆయన నటనతో, డాన్స్‌తో అన్నివర్గాల ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందాడు. అలాంటి ఎన్టీఆర్ కి ‘మహానటి’ సినిమాలో తన తాత నందమూరి తారకరామారావు పాత్ర కోసం సంప్రదించారు.. వైజయంతి మూవీస్ వారితో యంగ్‌టైగర్‌కు మంచి సాన్నిహిత్యం ఉన్నప్పటికీ, ఆయన ఆ ఆఫర్‌ని సున్నితంగా తిరస్కరించాడు. ఇక బాల‌య్య తెర‌కెక్కించిన ఎన్టీఆర్ బ‌యోపిక్‌లోనూ జూనియ‌ర్ ఎన్టీఆర్ త‌న తాత పాత్ర‌లో క‌నిపిస్తాడ‌ని అందరు ఊహించారు. కాని అది జ‌ర‌గ‌లేదు.

Thalaivi

అయితే తాజాగా యంగ్‌టైగర్‌కు మరోసారి తన తాత పాత్రలో నటించే అవకాశం వచ్చిందట. తమిళనాడు దివంగత సీఎం జయలలిత బయోపిక్‌గా కోలీవుడ్‌ల్లో ‘తలైవి’ పేరుతో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్‌ బ్యూటీ కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రధారిగా కనిపించనుంది. అయితే తెలుగులో సీనియర్‌ ఎన్టీ రామారావుతోను జయలలిత పలు సినిమాల్లో నటించారు.

అందువలన ఆయన పాత్ర కోసం జూనియర్‌ ఎన్టీఆర్‌ను అడిగారట. అయితే ఈ ఆఫర్‌ను కూడా జూ.ఎన్టీఆర్ సున్నితంగా తిరస్కరించాడని సినీవర్గాల సమాచారం. మరి ఈ వార్తపై అధికారిక ప్రకటన రావల్సివుదంది. ప్రస్తుతం ఎన్టీఆర్‌ ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో నటిస్తున్నాడు ఈ చిత్రం 2030 సంక్రాంతికి విడుదల కానుంది.

The makers of the Jayalalithaa biopic believe that Young Tiger Jr NTR is perfect to essay the role of his grandfather Nandamuri Taraka Rama Rao..

- Advertisement -