- Advertisement -
ప్రతి ఏటా వర్షాకాలంలో కాలనీలు ముంపునకు గురవుతూ ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. శాశ్వత పరిష్కారం కోసం సమగ్ర నాలా అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేస్తామన్నారు.
శుక్రవారం ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని నాగమయ కుంట అభివృద్ధి పనులను మహమూద్ అలీతో కలిసి ప్రారంభించారు మంత్రి తలసాని. ఈ సందర్భంగా మాట్లాడిన తలసాని…వరద ముంపు నుంచి ఎస్‌ఎన్‌డీపీ ద్వారా (SNDP) శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా రోడ్లు, సీవరేజ్, ఫ్లై ఓవర్ల నిర్మాణం, అభివృద్ధి పనులు చేపడుతామన్నారు.
- Advertisement -