జార్జిరెడ్డి పెద్దహిట్ కావాలి: తలసాని సాయి

598
talasani
- Advertisement -

విద్యార్థి విప్లవోద్యమ నాయకుడు జార్జిరెడ్డి కథతో తెరకెక్కిన చిత్రం జార్జిరెడ్డి. ఈ నెల 22న విడుదల కాబోతోన్న ఈ సినిమా గురించి ఇటు ఇండస్ట్రీలో అటు జనాల్లో ఆసక్తి నెలకొంది.మరోవైపు ఎబివిపి,పీడియస్ యూ విద్యార్థి సంఘాల కామెంట్స్ తో హాట్ టాపిక్ అయింది ఈ చిత్రం.ఇండస్ట్రీ పెద్దలు కూడా ఈ సినిమాకు సహాయపడుతున్నారు.

ఇప్పటికే మెగా బ్రదర్ నాగబాబు సినిమా ట్రైలర్ గురించి మాట్లాడగా..రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి మూవీ లోని సాంగ్ ను రిలీజ్ చేసి సహాయపడ్డారు. విజయ్ దేవరకొండ,నితిన్,సాయి ధరమ్ తేజ్, నిఖిల్,విశ్వక్ సేన్,పూరీ జగన్నాథ్,రామ్ గోపాల్ వర్మ,సుకుమార్ లు ట్రైలర్ షేర్ చేసి బెస్ట్ విషస్ తెలిపారు.

ఇటు రాజకీయ నాయకుల్లో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది.టీఆర్ ఎస్ లీడర్,సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి పోటీ చేసిన తలసాని సాయి ఈ సినిమా టీమ్ ను అభినందించారు.సినిమా దర్శకుడు జీవన్ రెడ్డి, నిర్మాతలు అప్పిరెడ్డి,సంజయ్ రెడ్డి,దామురెడ్డిలకు ,డిస్ట్రిబ్యూటర్ అభిషేక్ నామా లకు విషస్ తెలిపారు.ఈ శుక్రవారం రిలీజ్ కాబోతున్న ఈ మూవీ పెద్ద హిట్ కావాాలని ఆకాంక్షించారు.

TRS MP Contestant, Leader Talasani Sai wishes to George Reddy…TRS MP Contestant, Leader Talasani Sai wishes to George Reddy

- Advertisement -