గణేశ్‌ నిమజ్జనంకు అన్ని ఏర్పాట్లు పూర్తి :తలసాని శ్రీనివాస్‌

93
talasani
- Advertisement -

గణేశ్‌ నిమజ్జనానికి ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసిందని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. నిమజ్జానాల విషయంలో ఎలాంటి ఆంక్షలు లేవని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ కావాలనే ప్రజల్లో గందరగోళం సృష్టిస్తోందని మండిపడ్డారు. పండగలను రాజకీయం చేయడం ఎంతవరకు సమంజసమో ఆత్మపరిశీలన చేసుకోవాలని వ్యాఖ్యానించారు. ఇవాళ ఖైరతాబాద్‌ మహాగణపతిని మంత్రి దర్శించుకున్నారు. పర్యావరణహిత గణేశ్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా తలసాని మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఎక్కడ కూడా ఇంత పెద్దెత్తున్న వినాయక చవితి ఏర్పాట్లు చేయడంలేదన్నారు. గణేశ్‌ నిమజ్జనం ఏర్పాట్లు పకడ్బందీగా జరుగుతున్నాయన్నారు. హుస్సేన్‌ సాగర్‌లో నిమజ్జనం ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు. అక్కడ ఎన్టీఆర్‌ మార్గ్‌లో ఏర్పాటు చేసిన క్రేన్‌ నెంబర్‌ 1 నుంచి బయలుదేరి ట్యాంక్‌బండ్‌ వరకు వెళ్లి పరిశీలించారు. పోలీసు సహా అన్ని ప్రభుత్వ శాఖలు నిమజ్జనం కోసం సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. బాలాపూర్‌ గణేశుడిని కూడా హైదరాబాద్‌ ట్యాంక్‌ బండ్‌లోనే నిమజ్జనం చేయనున్నారు. ఇందుకోసం ట్యాంక్‌ బండ్‌పై 8 క్రేన్లు ట్యాంక్‌బండ్‌ చుట్టూ 22క్రేన్‌లను సిద్ధంగా ఉంచామన్నారు. ఇవికాక ఎన్టీఆర్‌ మార్గం మీద మరో 9 క్రేన్లు, పీపుల్స్‌ ప్లాజాలో 3 క్రేన్లు, రెండు బేబీ పాండ్ల వద్ద 2క్రేన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఓ వైపు గణేశ్‌ నిమజ్జనం కోసం ఏర్పాట్లు జరుగుతుంటే.. మరోవైపు ర్యాలీలు,దీక్షలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడంలేదని తలసాని అన్నారు.

- Advertisement -