కమాన్‌ల ఏర్పాటుకు భూమి పూజ చేసిన తలసాని సాయి కిరణ్..

26

సికింద్రాబాద్ మహంకాళి దేవాలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రజలందరికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలనే ఉద్దేశ్యంతో రెండు వైపుల కమాన్ ల ఏర్పాటుకు భూమి పూజ చేశారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబసభ్యులు. కామన్ ల నిర్మాణం ఒకటేమో ఆర్పీ రోడ్డు బాట దగ్గర మరొకటి ఎంజీ రోడ్డు పాత రాంగోపాల్ పేట్ పోలీస్ స్టేషన్ ఎదురుగా నిర్మించడానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శ్రీమతి సువర్ణ, తనయుడు సికింద్రాబాద్ టీఆర్‌ఎస్ పార్లమెంట్ ఇంచార్జి సాయి కిరణ్ యాదవ్ కుటుంబసభ్యులు టీఆర్‌ఎస్ నేతలతో కలసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సాయి కిరణ్ మాట్లాడుతూ.. ఎంతో చరిత్ర కలిగిన ఉజ్జయినీ మహాకాలి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరారు.. జాతర కోసం వచ్చే లక్షలాది మంది భక్తుల సౌకర్యార్థం మా సొంత నిధులతో ఈ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు.