మాగంటి గోపినాథ్ తనకు సోదరుడు వంటి వాడని…ఆయన మృతి బాధాకరమన్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. మాదాపూర్‌లోని గోపినాథ్ నివాసానికి వెళ్లిన తలసాని.. ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అన్ని విధాలుగా అండగా ఉంటామని, ధైర్యంగా ఉండాలని ధైర్యం చెప్పారు. 1992 నుండి మాగంటి గోపీనాథ్, తాను ఒక సోదరుడిగా, మంచి మిత్రులుగా కలిసి రాజకీయాలలో ఉన్నామని గుర్తు చేసుకున్నారు. గత నెల 26వ తేదీన తాను కుటుంబ సభ్యులతో కలిసి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్ళామని, వెళ్ళే ముందు కూడా తాము కలుసుకున్నామని వివరించారు.
మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని పార్టీ శ్రేణులు కూడా ధైర్యంగా ఉండాలని కోరారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ వెంట మలక్‌పేట నియోజకవర్గ ఇంచార్జి ఆజాం, అమీర్‌పేట డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు హన్మంతరావు, నాయకులు నామన సంతోష్ కుమార్, అశోక్ యాదవ్, శ్రీహరి, ఆరీఫ్, హరిసింగ్, నారాయణ రాజు తదితరులు ఉన్నారు.
Also Read:కాళేశ్వరం కమిషన్ విచారణకు హరీశ్‌రావు

