కేసీఆర్ పాలన బీసీల పాలిట స్వర్ణయుగం: మంత్రి తలసాని

201
Talasani
- Advertisement -

ఎన్నికలపుడు రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలు విడుదల చేస్తుంటాయి,హామీలు ఇస్తుంటాయి.ఆ హామీలను ఎన్నికలప్పుడు ఇచ్చి మర్చి పోయే చరిత్ర ఇతర పార్టీలది,టీఆర్‌ది కాదు అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రెస్ మీట్‌లో మాట్లాడారు. కుల వృత్తులను పరిరక్షిస్తూ బీసీలకు చేయూత నిస్తున్నది కెసిఆర్ యే..బీసీల పాలిట స్వర్ణయుగం కెసిఆర్ పాలన అని మంత్రి తెలిపారు. కాంగ్రెస్ బీసీల గురించి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించడమే. ఎన్నికలప్పుడే కాంగ్రెస్‌కు బీసీలు గుర్తొస్తున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీసీ లకు 50 శాతం సీట్లు అంటూ కాంగ్రెస్ మాట్లాడటం హాస్యస్పదమన్నారు. రిజెర్వేషన్‌లపై కోర్టుకు వెళతామనడం కాంగ్రెస్ ఎన్నికల నుంచి పారిపోయింది అనడానికి నిదర్శనం. బీసీలకు న్యాయం చేయడం లేదని గాంధీ భవన్‌లో జరిగిన ఎన్నో కొట్లాటలు మనం చూశాం. బీసీలకు ఎన్నో పథకాలు తెచ్చిన ఘనత కెసిఆర్ దే..స్థానిక సంస్థల ఎన్నికల్లో జనరల్ సీట్లలో కూడా బీసీ లను నిలబెట్టిన ఘనత టీ ఆర్ ఎస్ దే అని మంత్రి కొనియాడారు.

కాంగ్రెస్ కార్చే మొసలి కన్నీళ్లను ఎవ్వరూ నమ్మరు..వరద బాధితులను ఉదారంగా ఆదుకున్నది కెసిఆర్ యే.కాంగ్రెస్ బీసీల గురించి మాట్లాడితే రాయితో నెత్తి పగలగొట్టు కోవాలని పిస్తోందన్నారు..బీసీల ఆత్మగౌరవాన్ని పెంచింది కెసిఆర్ యే. అధికారంలో ఉన్నపుడు ఒక్క వర్గం తప్ప కాంగ్రెస్ కు ఎవ్వరూ కనబడరు.ప్రతి పక్షంలో ఉన్నపుడే కనబడతారు. బీసీలకు చట్ట సభల్లో రిజెర్వేషన్ల గురించి అసెంబ్లీ తీర్మానం చేసి పంపించాం.విషయం కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉంది. ఏదీ చేసినా కెసిఆర్ యే చేస్తారు..కాంగ్రెస్ వల్ల కాదు. దుబ్బాకలో ప్రజా తీర్పు టీఆర్ఎస్ వైపే ఉంది..ఈ నెల పదిన చూస్తారని మంత్రి స్పష్టం చేశారు.

మరోవైపు బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి నిధులు ఇవ్వడం లేదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రోటో కాల్ ప్రకారం హైదరాబాద్ వస్తున్నాడు తప్ప నిధులు తేవడం లేదు.కరోనా సమయం లోనూ ప్రభుత్వాలను కూల్చే విషయంలో బీజేపీ శ్రద్ద చూపింది..కానీ ప్రజా సంక్షేమంలో చూపలేదు అని మంత్రి తలసాని విమర్శించారు. హైదరాబాద్‌కు కేంద్ర బృందం వచ్చినా వరద సాయం మాత్రం ఇంకా రాలేదు. బీజేపీ వన్నీ గాలి మాటలే. దుబ్బాకలో పెన్షన్లపై బీజేపీ చెప్పిన అబద్దాలను మా మంత్రి హరీష్ రావు వివరంగా ఖండించారు. బీజేపీ ఎంపీలు నలుగురు గాలిలో గెలిచారు. బండి సంజయ్,అరవింద్ తమ పరుష పదజాలాన్ని వాడడం తగ్గించుకుంటే మంచిదని తలసాని హీతవు పలికారు.

ముఖ్యమంత్రిని ఏక వచనం తో సంబోధించడం మంచిది కాదు. ఇలా మాట్లాడినోళ్లు చాలా మంది రాజకీయంగా ఓడి పోయారు.మళ్ళీ గెలవ లేరు. టీఆర్‌ఎస్ కు ప్రత్యామ్నాయం తామే అని రెండు సీట్లు కూడా లేని వారు చెప్పడం నవ్వు తెప్పిస్తోంది. బీజేపీ వాళ్ళు తమ భాష మార్చుకోకుంటే మేము ప్రధాని మోడీకి కూడా అదే భాషలో జవాబిస్తామన్నారు మంత్రి. ఒక్క ఓటుతో గెలిచినా గెలిచినట్టే..అసెంబ్లీ కి రానిస్తారు. దుబ్బాకలో టీఆర్ఎస్ మంచి మెజారిటీ నే సాధిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ పేర్కొన్నారు.

- Advertisement -