23న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం: తలసాని

301
talasani srinivas
- Advertisement -

కరోనా నేపధ్యంలో బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణం ఈ నెల 23 వ తేదీన ఆలయంలోనే వేదపండితుల సమక్షంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు మంత్రి తలసాని శ్రీనివాస్. హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్ లోని మంత్రి కార్యాలయంలో జరిగిన సమావేశంలో దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, జోనల్ కమిషనర్ కార్పొరేటర్లు నామన శేషుకుమారి, కోలన్ లక్ష్మి, ఆలయ ఈవో శర్మ, పంజాగుట్ట ఏసీపీ తిరుపతన్న తదితరులు పాల్గొన్నారు.

ఎన్నో సంవత్సరాలుగా ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న అమ్మవారి కళ్యాణాన్ని ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు తిలకిస్తారన్నారు. అమ్మవారి కళ్యాణం తరువాత రోజు రథోత్సవం కూడా ఆలయ ప్రాంగణంలోనే నిర్వహించబడుతుందన్నారు.

అమ్మ వారి కళ్యాణాన్ని భక్తులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందన్నారు. కళ్యాణం రోజు అమ్మవారి దర్శనానికి కూడా భక్తులు రావొద్దని తలసాని విజ్ఞప్తి చేశారు. కరోనా మహమ్మారి రోజురోజుకు వ్యాప్తి చెందుతున్న తరుణంలో నియంత్రణ కోసం ప్రభుత్వాలు జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా అమ్మవారి కళ్యాణం జరుగుతుందని చెప్పారు.

- Advertisement -