దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తొలిదశలో ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు వ్యాక్సినేషన్ ఇవ్వగా మార్చి నుండి ప్రజలకు ఇవ్వనున్నారు. అయితే తొలిదశ వ్యాక్సిన్ తీసుకున్న ఫ్రంట్‌లైన్ వారియర్స్ షెడ్యూల్ ప్రకారం రెండో డోసు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ.
కొవిడ్-19 టీకా కారణంగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదని, ప్రతి ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ కార్మికులకు టీకాలు వేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కరోనా టీకా కోసం పేరు నమోదు చేయించుకుని, ఇంకా టీకా వేయించుకోని ఆరోగ్య కార్యకర్తలకు ఈ నెల 20 వరకు, ఫ్రంట్‌లైన్ కార్యకర్తలకు మార్చి 6 నాటికి ఈ ప్రక్రియ ముగించాలని కేంద్ర ఆరోగ్యశాఖ నిర్ణయించింది.
టీకాలు సురక్షితమైనవని, ఇమ్యునోజెనిసిటీ అన్ని ప్రమాణాలను నెరవేరుస్తాయని…. వ్యాక్సిన్లపై ఎలాంటి పుకార్లు, తప్పుడు సమాచారాన్ని నమ్మొద్దని కోరింది ఆరోగ్య శాఖ. దేశంలో తీవ్రమైన ప్రతికూల సంఘటనలు నమోదు కాలేదని, నివేదించబడిందని 0.0004 శాతమేనని వెల్లడించింది.