51 ఏళ్ళు..పెళ్లికి ఇంకా టైమ్ ఉందట

21
- Advertisement -

సీనియర్ నటి టబు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముదురు వయసులో కూడా ఘాటు అందాలతో కుర్రాళ్ళ హృదయాలను కుదిపేస్తోంది. ఐతే, 51 సంవత్సరాల వయసు వచ్చినా టబు ఇంకా పెళ్లి పీటలు ఎక్కలేదు. మొత్తానికి టబు తన పెళ్లి గురించి పెదవి విప్పింది. ఆమె హీరోయిన్ గా నటించిన ఓ వెబ్ సిరీస్ షూట్ లో భాగంగా టబు బాలీవుడ్ మీడియాతో మాట్లాడింది. ఈ క్రమంలో టబు తన పెళ్ళికి సంబంధించినంతవరకు పాత విషయమే మళ్ళీ చెప్పింది. ఇంతకీ టబు ఏం చెప్పిందో ఆమె మాటల్లోనే విందాం.

టబు మాట్లాడుతూ.. ‘నేను పెళ్లి చేసుకుంటాను, కానీ అది ఇప్పుడే కాదు. అయినా, టైం వస్తే అది ఆగదు కదా అని సమాధానం ఇచ్చింది 51 ఏళ్ల టబు. తనకు పెళ్లి, పిల్లలు, ఫ్యామిలీ అంటే ఇష్టం అని, కానీ తన పెళ్ళికి టైం కలిసి రావడం లేదంటూ టబు చాలా సంవత్సరాల నుంచి తప్పించుకుంటుంది. నిజానికి ఈ వయసులో టబు పెళ్లి చేసుకున్నా.. ఆమె జీవితం అందరి జీవితాలు లాగా ఉండదు అని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఐతే టబు సన్నిహితులు మాత్రం.. టబుకి పెళ్లి మాత్రమే కాలేదు అని, ఆమె తన జీవితాన్ని సంపూర్ణంగా ఆస్వాదిస్తోంది అని, కాబట్టి ఆమె గురించి ఎక్కువ ఆలోచించొద్దు అని చెబుతున్నారు.

Also Read:జవాన్ సునామీ.. రెండు రోజుల్లో 250 కోట్లు

ఏది ఏమైనా టబు అంటే నేటికీ కుర్రాళ్ళో మంచి ఫాలోయింగ్ ఉంది. టబు కోసం ముఖ్యంగా టబు అందాల ఆరబోత కోసం నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూస్తూనే ఉంటారు. ఇక పెళ్లి విషయంలో టబుకి ఏవో సమస్యలు ఉన్నట్లుగా అనిపిస్తోంది. అందుకే, అసలు విషయం చెప్పడం ఇష్టం లేక, టబు తన పెళ్లి పై పై విధంగా సమాధానం ఇస్తోంది. దాదాపుగా 25 ఏళ్లుగా టబు ఇదే ఆన్సర్ ఇస్తోంది. టైం వస్తే అది ఆగదు కదా అంటుంది. టైం వచ్చి వెళ్ళిపోయింది అనే విషయం టబుకు ఎందుకు అర్ధం కావడం లేదో !!.

Also Read:ఎన్టీఆర్..మరో మూవీ రీ రిలీజ్!

- Advertisement -