సీనియర్ హీరోయిన్ టబు లేటు వయసులోనూ ఇంకా ఫుల్ స్వింగ్ లో ఉంది. అటు ఓటీటీ సిరీస్ లతోనూ వరుస విజయాలతో దూసుకుపోతుంది. సక్సెస్ కి జూనియర్.. సీనియర్ ఏముంది? అంతా ఒక్కటే అంటూ మార్కెట్ లో కొత్త ఐడెంటిటీని దక్కించుకుంటూ టబు రోజురోజుకూ తన అందాల వలయంలో కుర్రాళ్లను కుదిపేస్తోంది. మరోసారి తన అభిమానులకు ఓ సర్ ప్రైజ్ ఇవ్వాలని టబు కసరత్తులు చేస్తోంది. కాల్ ఆంటీ అనే సరికొత్త సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి టబు రెడీ అవుతుంది. ఇప్పుడన్నీ రకాల పాత్రలతోనూ టబు ఆకట్టుకుంటుంది.
హీరోలకు తల్లి పాత్రల్లో నటిస్తోంది, మరోవైపు కొన్ని బోల్డ్ పాత్రల్లోనూ ఆకట్టుకుంటుంది. మొత్తానికి తన సినిమా జర్నీతో పాటు ప్రేమ కలాపాల్లోన్న ఈ ముదురు భామ ముందుంటుందని ప్రూవ్ చేసింది. పైగా ప్రస్తుతం టబు నిత్యం బిజీగా ఉంటుంది. మరి ఇలాంటి టఫ్ షెడ్యూల్ నుంచి ఉపశమనం పొందడం ఎలా అంటే? రొటీన్ నుంచి బ్రేక్ తీసుకుని కొత్త ప్రదేశంలో వాలిపోతుందిట టబు. అలా చేయడం వల్ల శారీరకంగా..మానసికంగా ఉన్న అలసట దూరమై మరింత ఉత్సాహంగా పనిచయగలమని టబు అంటోంది. ముఖ్యంగా ఒంటరిగా ప్రయాణం చేయడం వల్ల మనలో స్టప్ ఎంతో తెలుస్తుందని కూడా టబు చెప్పుకొచ్చింది.
ఇతరులపై ఆధారంపడకుండా సొంత పనలు ఎలా చేసుకోగల్గుతున్నాం..అన్ని పక్కాగా చేయగల్గు తున్నామా ? లేదా? అన్నది ఒంటరిగా ప్రయత్నించినప్పుడే తెలుస్తుందని టబు అంటోంది. ఈ ప్రోసస్ లో కొత్త పరిచయాలు.. వాళ్లతో మాట్లాడటం.. పుసక్తకాలు చదవడం.. సరదాగా షాపింగ్ చేయడం వంటివి ఎన్నో విషయాలు తెలియజేస్తాయని టబు చెబుతుంది. ఏది ఏమైనా టబు ఏం చేసినా ఏం చెప్పినా అది హాట్ టాపిక్ అవుతూనే ఉంది.
Also Read:
ప్రోటీన్ల కోసం ఇవి తినండి…