పిక్‌ టాక్‌: డోస్ పెంచిన తాప్సీ..!

219
Taapsee Pannu Trolled For Judwaa 2 Bikini Pic
- Advertisement -

తన అందం మరియు అభినయంతో తెలుగు వారిని ఆకట్టుకున్న ఢిల్లీ బ్యూటి తాప్సీ. తెలుగులో అగ్రహీరోలతో కలిసి నటించిన ఈ అమ్మడికి ఇంతవరకు సరైన హిట్ లేదు. ఒకే ఒక్క ‘Mr. పర్ ఫెక్ట్’ సినిమా తప్ప మిగిలిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచాయి. దీంతో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు తమిళ్,బాలీవుడ్‌లోకి వెళ్లింది. బాలీవుడ్ లో సక్సెస్ కొట్టేసి మహా జోరు మీద ఉంది.

గతంలో తెలిసీ తెలియక గ్లామరస్‌ షో చేసేశాను.. ఇకపై అలాంటి అందాల ప్రదర్శన చేయబోను..’ అంటూ ఆ మధ్య పలు ఇంటర్వ్యూల్లో గ్లామర్‌కి వ్యతిరేకంగా ఎడా పెడా కామెంట్లు చేసేసిన తాప్సీ, ‘జుడ్వా-2’ సినిమా కోసం మాత్రం, గ్లామర్‌ హద్దులు చెరిపేసింది. ఈ సినిమాలో టూ పీస్ బికినీలో ఈ సొట్టబుగ్గల సుందరీ  అందాలను చూసి బాలీవుడ్‌ జనాలు ఫిదా అయిపోయారట.

దీంతోమరింతగా రెచ్చిపోతున్న ఈ బ్యూటీ బికినీ అందాలను మరింతగా  ప్రదర్శించడమే కాదు ఉచిత సలహాలు సైతం ఇచ్చేస్తోంది.  కెరటానికి ఎదురెళ్ళాలనుకుంటే, ధృఢంగా నిలబడాలి.. ఆ క్షణాల్లో పెదాలపై చిరునవ్వు మాత్రం మర్చిపోవద్దు..అంటూ  ఫోటోలను పోస్ట్‌ చేసింది. అందాల ప్రపంచంలో అందంగా కన్పించకపోతే ఎలా.?…పైగా బీచ్‌లో బికినీతో కాక, చీర కట్టుకుని స్విమ్‌ చేయగలమా.? అని ప్రశ్నిస్తోంది.

- Advertisement -