చిరుని కాదన్నాడు….ఎన్టీఆర్‌కి ఓకే చెప్పాడు…!

75
Sunil says No to Mega Heros..!

మొన్నటివరకు ఓన్లీ హీరో వేషాలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సునీల్ గతంలో తాను చేసిన తప్పును తెలుసుకున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న సినిమాలో మళ్లీ కమెడియన్‌గా కనిపించేందుకు సిద్దమయ్యాడు.

త్రివిక్ర‌మ్ ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాన్ హీరోగా ఓ చిత్రాన్ని తెర‌కెక్కించే ప‌నిలో ఉన్నాడు. ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతోంది. ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను సునీల్ తో చేయించాలని త్రివిక్రమ్ అనుకున్నాడట. ఆయనని దృష్టిలో పెట్టుకునే త్రివిక్రమ్ ఓ పాత్రను డిజైన్ చేశాడు. అయితే ఈ పాత్రను చేయడానికి సునీల్ పెద్దగా ఆసక్తిని చూపలేదనేది తాజా సమాచారం.

గతంలో మెగాస్టార్ చిరంజీవి ‘ ఖైదీ నం.150 ‘ లో సునీల్ కి కమెడియన్ గా ఆఫర్ వచ్చింది. మెగాస్టార్ అడగడంతో సునీల్ తప్పకుండా కమెడియన్ గా చేస్తాడని అనుకున్నారంతా..కానీ అలా అనుకున్న వారందరికీ షాక్ ఇచ్చాడు సునీల్. దాంతో సునీల్ ప్లేస్ లో ఆలీని తీసుకున్నారు. తాజాగా పవర్ స్టార్‌ పవన్ కళ్యాణ్ కు సైతం సునీల్ హ్యాండివ్వడం పెద్ద టాపిక్‌గా మారింది. సరైన హిట్లు లేని సునీల్ నో చెప్పాడనే విషయం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.