తాప్సి కి గోల్డెన్ ఆఫర్!

200
Taapsee-Pannu
- Advertisement -

సొట్ట బుగ్గల తాప్సికి బాలీవుడ్ బాగా వర్కవుట్ అయింది. సౌత్ లో ఎన్ని సినిమాలు చేసిన రాని క్రేజ్, సక్సెస్ కేవలం రెండు మూడు సినిమాలతో హిందీలో అందుకుంది. అటు నటిగాను, ఇటు గ్లామర్ భామగాను ఇమేజ్ తెచ్చుకున్న తాప్సి ఫోకస్ ఇప్పుడు గ్లామర్ హీరోయిన్ గా పేరు తెచ్చుకునే విషయం పై పడింది. అందుకే హాట్ హాట్ ఫోటో షూట్ లతో రెచ్చగొట్టేందుకు సిద్ధం అయింది.

taapsee-diljit-

తాజాగా  ఈ భామకు బాలీవుడ్ లో మరో అవకాశం దక్కింది. భారత హాకీ మాజీ ఆటగాడు, అర్జున్ అవార్డ్ గ్రహీత సందీప్‌ సింగ్‌ బయోపిక్‌లో తాప్సీ నటిస్తోంది. సందీప్‌ సింగ్‌ పాత్రలో దిల్జిత్‌ దోసాంజ్‌ నటిస్తున్నాడు. భారత హాకీ చరిత్రలో సందీప్‌ సింగ్‌కి ప్రత్యేకమైన గుర్తింపు వుంది. ఓ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ సందీప్‌ సింగ్‌, ఇక కోలుకునే అవకాశం లేదని డాక్టర్లు తేల్చేసినా, అనూహ్యంగా కోలుకుని, తిరిగి హాకీ మైదానంలో ఆటగాడిగా అడుగుపెట్టి సత్తా చాటాడు. ‘ఇదొక ఇన్‌స్పైరింగ్‌ స్టోరీ.. ఈ సినిమాలో నా పాత్ర చాలా బలంగా వుంటుంది. మానసికంగా ఎంతో ధృఢమైన యువతి పాత్రలో కన్పించబోతున్నాను. క్లిష్ట సమయంలో సందీప్‌కి అండగా నిలిచిన పాత్ర అది. తెరపై భావోద్వేగాలు అత్యద్భుతంగా కన్పించబోతున్నాయి. నాకిదొక ఛాలెంజింగ్‌ రోల్‌..’ అని తాప్సీ చెప్పుకొచ్చింది.

- Advertisement -