పిచ్చెక్కిస్తోన్న జాక్వెలిన్ ఫెర్నాండేజ్

409
Jacqueline-Fernandez
- Advertisement -

గ్లామర్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఓ రేంజ్ లో రెచ్చిపోవటం కొత్తేం కాదు. కానీ, ఇప్పటిదాకా పీలికల్లాంటి డ్రెస్సులతో మ్యానేజ్ చేసిన ఈ లంక సోయగం ఈ మధ్య సోషల్ మీడియాలో పోటోలను తెగ పోస్ట్ చేస్తోంది. షూటింగ్ లో ఎంత బిజీగా ఉన్న అమ్మడిని ఫాలో అయ్యే కుర్రకారును ప్రతి రోజు తన అందాలతో ఆకర్షిస్తోంది. బాలీవుడ్ లో హాట్ బ్యూటీగా అమ్మడికి వీరాభిమానులు ఉన్నారు. సినిమాలకంటే ఎక్కువగా హాట్ హాట్ పోజ్ లతో కుర్రకారును కట్టిపడేసిన ఈమె చాన్నాళ్ల క్రితమే ఇండస్ట్రీలో అడుగుపెట్టినా కిక్ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ అయిపోయింది.

Jacqueline_Fernandez_mud

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఇటు సినీ ఆఫర్లను, అటు ఈవెంట్స్ ను, యాడ్స్ ను కూడా బాగా క్యాష్ చేసుకుంటోంది. సినిమాల్లో ఎలాంటి పాత్రనైనా సరే తనదైన శైలిలో చేసి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమాలను చేస్తోంది. రీసెంట్ గా జూడ్వా 2 సినిమాలో కనిపించిన ఈ భామ మంచి ప్రశంసలను అందుకుంది. పక్కన సొట్ట బుగ్గల సుందరి బికినీతో పోటీకి వచ్చినా కూడా జాక్వెలిన్ అందాలే స్క్రీన్ పై ఎక్కువగా మెరిశాయి.

jacqueline

ప్రస్తుతం ఈ భామ కరణ్ జోహార్ నిర్మిస్తున్న డ్రైవ్ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇజ్రాయెల్ లో జరుగుతోంది. రోజంతా షూటింగ్ లో పాల్గొన్న ఫెర్నాండేజ్ కాస్త బ్రేక్ దొరకగానే అక్కడ ఫెమస్ అయిన ‘డెడ్ సీ’ అనే సముద్రం అంచున మట్టిని వంటికి రాసుకొని ఫొటోలకు ఫోజిచ్చింది. మట్టిలో అమ్మడి బికినీ అందాలు బాగానే ఉన్నాయని ఇక ఆమె ఫాలోవర్స్ ఒక్కొక్కరు ఒక్కో విధంగా కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తన ఒంటికి మట్టి పూసుకుని కూడా కుర్రకారును పిచ్చెక్కిస్తోంది.

- Advertisement -