పెళ్లిపై మరింత క్లారిటీ ఇచ్చిన తాప్సీ..!

167
taapsee
- Advertisement -

తెలుగు తెరపై అనతికాలంలో గుర్తింపు తెచ్చుకున్న నటి తాప్సీ. టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినా తర్వాత కోలీవుడ్, బాలీవుడ్‌లో నటించి మెప్పించారు తాప్సీ.
బాలీవుడ్‌లో స్థిరపడిన నటి తాప్సీ. మహిళా ప్రాధాన్యత కలిగిన కథా చిత్రాల్లో నటిస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది.

అయితే తాప్సీ డెన్మార్క్‌కు చెందిన బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు మాథ్యూస్‌ను ప్రేమిస్తుందడగా వీరిద్దరూ త్వరలోనే పెళ్ళి చేసుకోబోతున్నట్టు బాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై స్పందించిన తాప్సీ..చిత్ర పరిశ్రమకు చెందిన వారిలో ఒకరిని జీవిత భాగస్వామిగా ఎంచుకోడం తనకు ఇష్టం లేదని తెలిపింది.

రాణించే వృత్తి, వ్యక్తిగత జీవితం వేర్వేరుగా ఉండాలి. అదేసమయంలో మ్యాథ్యూస్‌ నాకు బాగా తెలిసిన వ్యక్తి. సన్నిహితుడు కూడా..అయితే సినిమా అవకాశాలు తగ్గినప్పుడే పెళ్లి చేసుకుంటానని వెల్లడించింది తాప్సీ.

- Advertisement -