ఆగని పెట్రో పరుగు..!

51
petrol

వరుసగా పెరుగుతున్న పెట్రోల్ ధరలు వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల అనంతరం పెట్రోల్ ధరలు 23 సార్లు పెరుగగా తాజాగా పెట్రోల్ పై 29 పైసలు, డీజిల్ పై 28 పైసలు పెంచాయి చమురు కంపెనీలు.

రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్,జమ్మూకాశ్మీర్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 100 కంటే ఎక్కువే ఉండగా దేశంలోనే అత్యధికంగా రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.106కి చేరింది. ముంబైలో పెట్రోల్‌ రూ.101.04, డీజిల్‌ రూ.94.15కి చేరింది.

గతేడాది జూన్ నెలలో రూ.80కి లభించిన డీజిల్ 2021 జూన్ వచ్చే సరికి రూ.15 పెరిగి రూ. 95 దాటగా పెట్రోల్ కూడా ఏకంగా 20 రూపాయలు పెరిగింది.