T20 Worldcup:టోర్నిలో పాల్గొనే జట్లు ఇవే!

8
- Advertisement -

వచ్చే ఏడాది భారత్, శ్రీలంక వేదికగా టీ20 ప్రపంచకప్‌ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నిలో 20 జట్లు పాల్గొననుండగా చివరి బెర్తును యూఏఈ దక్కించుకుంది. ఈస్ట్ ఏషియా పసిఫిక్ క్వాలిఫయర్స్‌లో ఆ జట్టు జపాన్‌ను ఓడించి.. ఈ టోర్నీలో చివరి బెర్తును ఖరారు చేసుకుంది.

ఆతిథ్య హోదాలో భారత్, శ్రీలంక జట్లు ఈ ఈవెంట్‌కు క్వాలిఫై అయ్యాయి. గత ప్రపంచకప్‌లో సూపర్-8కు చేరినందుకు గానూ.. భారత మినహా మరో ఏడు జట్లు కూడా క్వాలిఫై అయ్యాయి. ఈ జాబితాలో అప్ఘానిస్థాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, యూఎస్ఏ ఉన్నాయి.

ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా పాకిస్థాన్, న్యూజిలాండ్ టీమ్స్ క్వాలిఫై అయ్యాయి. మిగతా జట్లు క్వాలిఫయర్ మ్యాచులలో సత్తాచాటి.. ఈ టోర్నీలో ఆడేందుకు అర్హత సాధించాయి.

మొత్తంగా 20 జట్లను నాలుగు గ్రూపులుగా విభజిస్తారు. ఇందులో ఒక్కో గ్రూపులో ఐదు జట్లు ఉంటాయి. రౌండ్ రాబిన్ పద్దతిలో ఒక్కో జట్టు మిగతా నాలుగు జట్లతో మ్యాచులు ఆడాల్సి ఉంటుంది. లీగ్ స్టేజ్ ముగిసే సరికి టాప్-2లో ఉన్న జట్లు సూపర్-8కు అర్హత సాధిస్తాయి. అక్కడ కూడా ఈ 8 జట్లను రెండు గ్రూపులుగా విభజిస్తారు. రౌండ్ రాబిన్ పద్దతిలో ఒక్కో జట్టు తమ గ్రూపులోని మిగతా మూడు టీమ్స్‌తో ఆడుతుంది. సూపర్-8లో ఒక్కో గ్రూపులో టాప్-2లో నిలిచిన జట్లు సెమీ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. అక్కడ గెలిచిన జట్లు ఫైనల్ చేరుకుంటాయి.

Also Read:42 శాతం రిజర్వేషన్ల కోసం బీసీ బంద్

- Advertisement -