T20 Worldcup:రోహిత్ సేననే ఫేవరెట్

162
- Advertisement -

ఐసీసీ పురుషుల T20 ప్రపంచ కప్ 2024 ఫైనల్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్‌లో ఇరు జట్ల మధ్య టైటిల్ మ్యాచ్ జరగనుండగా ఇంగ్లండ్‌ను ఓడించి టీమిండియా సెమీఫైనల్‌కు చేరుకుంది. అదే సమయం లో ఆఫ్ఘనిస్థాన్‌ను ఓడించి దక్షిణాఫ్రికా తన స్థానాన్ని ఖాయం చేసుకుంది.

ఒకవైపు, భారత జట్టు రెండవసారి T20 ప్రపంచ కప్ ఛాంపియన్‌గా మార డానికి ప్రయత్నిస్తుండగా, దక్షిణాఫ్రికా తన మొదటి ప్రపంచ కప్ ఫైనల్‌ను ఆడటానికి సిద్ధంగా ఉంది. టీ20 వరల్డ్ కప్‌లో దక్షిణాఫ్రికాపై భారత్‌దే పైచేయి.

టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్- దక్షిణాఫ్రి కా, మధ్య ఇప్పటి వరకు 6 మ్యాచ్‌లు జరగ్గా అందులో టీమ్ ఇండియా 4 గెలిచి 2 ఓడింది. 2007లో జరిగిన తొలి ఎడిషన్‌లో భారత్‌ 37 పరుగుల తేడాతో విజయం సాధించింది.కాగా, 2009లో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. 2010లో దక్షిణాఫ్రికాపై 14 పరుగులతో విజయం సాధించింది. 2012లో 1 పరుగుతో, 2014లో 6 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. అయితే 2022లో దక్షిణాఫ్రికా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Also Read:సోంపు వల్ల ఎన్ని ఉపయోగాలో తెలుసా?

- Advertisement -