ఆతిథ్య విండీస్‌కు షాక్‌..సెమీస్‌లో సౌతాఫ్రికా

30
- Advertisement -

టీ20 ప్రపంచకప్‌లో ఆతిథ్య వెస్టిండీస్‌కు షాకిచ్చింది దక్షిణాఫ్రికా. సూపర్‌ 8లో భాగంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో వెస్టిండిస్ ఘోర ఆటతీరును కనబర్చి ఓటమి పాలైంది. వెస్టిండీస్ విధించిన 136 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన సౌతాఫ్రికా 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఆట మధ్యలో వర్షం అంతరాయం కలిగించడంతో సౌతాఫ్రికా టార్గెట్‌ను 17 ఓవర్లలో 123గా నిర్ణయించగా మరో 5 బంతులుండగానే టార్గెట్‌ను చేధించింది దక్షిణాఫ్రికా. ఈ విజయంతో గ్రూప్ 2 నుండి దక్షిణాఫ్రికా సెమీస్ బెర్త్ కన్ఫామ్ చేసుకోగా రెండో స్థానంలో ఇంగ్లాండ్ ఉంది.

ఈ ఓట‌మితో విండీస్ సెమీస్ ఆశ‌లు ఆవిర‌య్యాయి. సౌతాఫ్రికా బౌల‌ర్ల‌లో షంస్సీ 27 ర‌న్స్ ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు.

Also Read:మూవీ రివ్యూ..సందేహం

- Advertisement -