T20 World Cup:అమెరికా సంచలనం

32
- Advertisement -

టీ20 వరల్డ్ కప్‌లో అమెరికా సంచలనం సృష్టించింది. తొలిసారి టీ20 వరల్డ్ కప్ ఆడుతున్న అమెరికా… పాకిస్థాన్‌పై సూపర్ ఓవర్‌లో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కొల్పోయి 159 పరుగులు చేసింది. బాబర్‌ ఆజమ్‌ (44), షాదాబ్‌ ఖాన్‌ (40),షహీన్‌ షా అఫ్రిది (23 నాటౌట్‌)గా నిలిచారు.

ఇక తర్వాత బ్యాటింగ్ చేసిన అమెరికా 3 వికెట్లు కొల్పోయి 159 పరుగులు చేసింది. ఓపెనర్‌ మెనాక్‌ పటేల్‌(50), అరోన్‌ జోన్స్‌(36 నాటౌట్‌), అండ్రిస్‌ గౌస్‌(35) రాణించారు. మ్యాచ్ డ్రా గా ముగియడంతో సూపర్‌ ఓవర్‌లో అమెరికా విజయం సాధించింది.

మహమ్మద్‌ ఆమిర్‌ వేసిన సూపర్‌ ఓవర్‌లో అమెరికా వికెట్‌ కోల్పోయి 18 పరుగులు చేయగా పాకిస్థాన్ వికెట్ కొల్పోయి 13 పరుగులకే పరిమితమైంది. దీంతో టీ20ల్లో పాకిస్థాన్‌పై యూఎస్‌ఏకు ఇది తొలి విజయం కావడం విశేషం.

Also Read:చిరుకు పవన్ పాదాభివందనం

- Advertisement -