పది, ఇంటర్ తర్వాత ఏ కోర్సు ఎంచుకోవాలి?ఇంజనీరింగ్ బ్రాంచి ఎంపికలో ఇబ్బంది పడుతున్నారా?ఎంసెట్ వెబ్ కౌన్సెలింగ్‌లో కాలేజీల ఎంపికలో తికమకపడుతున్నారా? ఇంజనీరింగ్‌లో ఏ కోర్సు చేస్తే ఫ్యూచర్ ఉంటుంది? ఇలాంటి సందేహాల పరిష్కారానికి చక్కన వేదిక టీ న్యూస్ ఎడ్యుకేషన్ ఫెయిర్ -2024. ఇంజనీరింగ్, మెడికల్,ఫార్మసీ,బిజినెస్ మేనెజ్మెంట్ కాలేజీలు మరియు యూనివర్సిటీల వివరాలను ఒకే చోట తెలుసుకునే అద్భుత అవకాశం. నిష్ణాతులైన ప్రముఖులచే మాక్ కౌన్సెలింగ్, సెమినార్స్, కెరీర్ కౌన్సెలింగ్ నిర్వహించబడుతుంది.
వేదిక:హైదరాబాద్, అమీర్‌పేట, కమ్మ సంఘం. జూన్ 1,2 తేదీల్లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు జరిగే ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్‌కు ప్రవేశం ఉచితం.
ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ విద్యార్థుల బంగారు భవితకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంటర్ తర్వాత సాంప్రదాయక డిగ్రీ కోర్సులు చేయాలా…లేకుంటే ఇంజనీరింగ్, మెడిసన్ కోర్సుల కోసం ఎమ్సెట్ కోచింగ్‌లకు వెళ్లాలా అన్న ప్రశ్న ఎదురువుతుంది. ఇంటర్ దశలో విద్యార్థి సెలక్ట్ చేసుకునే కోర్సు. అతని బంగారు యావత్ భవిష్యత్‌ను నిర్దేశిస్తుంది.
ఇప్పటివరకు టీ న్యూస్ నిర్వహిస్తున్న ఎడ్యుకేషన్ ఫెయిర్‌లో వేల సంఖ్యలో విద్యార్థులు తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. వివిధ కాలేజీల సమాచారాన్ని తెలుసుకున్నారు. ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్‌లో ఎన్నో విద్యాసంస్థలు తమ కాలేజీల సమాచారం అందించనున్నాయి. ఎంసెట్ ర్యాంకు ఆధారంగా ఏ కాలేజీలో,ఏ బ్రాంచిలో సీటు వస్తుందో విద్యార్థులు మాక్ కౌన్సెలింగ్ ద్వారా అంచనాకు రావచ్చు. విద్యార్థులకు ఇంజనీరింగ్ కాలేజీ, బ్రాంచ్ ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వివిధ బ్రాంచ్‌లతో కెరీర్ స్కోప్, ఉన్నత విద్యావకాశాలు, పరిశ్రమలు కోరుకుంటున్న నైపుణ్యాల గురించి విద్యారంగ నిపుణులు అవగాహన కల్పించనున్నారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసి సలహాలు సూచనలు ఇస్తారు. కాబట్టి రెండు రోజుల పాటు జరిగే ఎడ్యుకేషనల్ ఫెయిర్‌కు విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో సహా పెద్ద సంఖ్యలో హాజరై తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని కోరుకుంటోంది greattelangaana.com
Also Read:“గం..గం..గణేశా”లో అదే హైలైట్:ఉదయ్ శెట్టి