గ్రీన్ ఛాలెంజ్‌…మొక్కలు నాటిన చిరంజీవులు

583
t chiranjeevulu
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్‌లో టీఆర్ఎస్ నాయకులు కర్నాటి విద్యాసాగర్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించారు రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్‌ కమిషనర్ టి.చిరంజీవులు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన గ్రీన్ ఛాలెంజ్‌కు కారణమైన జోగినపల్లి సంతోష్ కుమార్‌కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.గ్రీన్ ఛాలెంజ్ యజ్ఞంలో ఎందరో పాల్గొంటున్నారు…పచ్చదనాన్ని పర్యావరణాన్ని రక్షించాల్సిన బాధ్యత మనందరి మీద ఉందన్నారు.

ఈ ఛాలెంజ్‌ను అందరూ సహృదయంతో స్వీకరించి రాబోయే కాలంలో జనాభా నిష్పత్తి పరంగా ఎన్ని చెట్లు అవసరమో అన్ని చెట్లు పెరగడానికి మనమందరం తోడ్పడాలన్నారు. ఈ సందర్భంగా టీ.చిరంజీవులు ఐ.ఏ.ఎస్ గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించాల్సిందిగా యాదాద్రి కలెక్టర్ అనితా రాజేంద్రన్,ఐఏఎస్ స్టేట్ గెజిటెడ్ కిషన్,మై హోం గ్రూప్ సంస్థల ఛైర్మన్ జూపల్లి రామేశ్వర్‌ రావుకు గ్రీన్ ఛాలెంజ్‌ని విసిరారు.

- Advertisement -