హుజుర్ నగర్ టీఆర్ఎస్ దేః ఎమ్మెల్యే శంకర్ నాయక్

204
mla Shankar Naik

హుజుర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధి శానంపూడి సైదిరెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తారన్నారు మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్. మహబూబాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతిపక్ష నాయకులు ఆర్టీసీ కార్మికులను రెచ్చగొట్టి సమ్మె చేపిస్తున్నాయి.

ప్రతిపక్షాల వలలో ఆర్టీసీ కార్మికులు పడవద్దు. సీఎం కేసీఆర్ పండుగ పూట సమ్మె చేయవద్దు అన్నారే తప్ప సమ్మె చేసే హక్కు లేదని ఎప్పుడూ అనలేదన్నారు. ఆర్టీసీ కార్మికులు 28 శాతం ఫిట్మెంట్ అడిగితే 44 శాతం ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్ దే అన్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమించి చర్చలకు రావాలి.. అవసరం ఐతే సీఎం కేసీఆర్ కాళ్ళు పట్టుకొని ఒప్పిస్తానని చెప్పారు.