పించను కోసం ఇకపై మీరు ఆఫీసుల చుట్టు తిరగక్కర్లేదు. కళ్లముందే మనిషి కనిపిస్తున్నా బ్రతికున్నారనే సర్టిఫికేట్ తీసుకురావాల్సిన అవసరం ఉండదు. కేవలం ఒకే ఒక్క సెల్ఫీతో మీకు రావాల్సిన ప్రయోజనాలు నేరుగా అందుకోవచ్చు.
తెలంగాణ ప్రభుత్వం త్వరలో తీసుకురాబోతున్న ఈ యాప్‌తో అన్నిసమస్యలు పరిష్కారం కానున్నాయి. దేశంలోనే తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI), మెషీన్ లెర్నింగ్, ఇతర అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలను సమ్మిళితం చేసి ఓ యాప్ ను డెవలప్ చేశారు. మూడు రకాల సాంకేతికతలను ఒకచోట చేర్చి దానిని మొబైల్ యాప్‌తో అనుసంధానించడం ద్వారా ఈ వినూత్న సాంకేతికతకు రూపునిచ్చారు.
ఈ మొబైల్ అప్లికేషన్ ను టీ యాప్ ఫోలియోలో అందుబాటులో ఉంచారు. ఒక్క సెల్ఫీతోనే దీని కచ్చితత్వం తెలుసుకోవచ్చు. లబ్దిదారుడిని సెల్ఫీ తీయడం ద్వారా లైవ్ అథెంటికేషన్, పేరు, చిరునామా, ఇతర డెమోగ్రాఫిక్ వివరాలతో డేటాబేస్‌లోని 10, 15 ఏళ్ల క్రితం నాటి ఫోటోతో మ్యాచ్ చేస్తే ఈ వివరాలున్న వ్యక్తి. సెల్ఫీ దిగిన వ్యక్తి ఒకరే అన్న అథెంటికేషన్ వస్తుంది. ఒకవేళ మొదటిది ఓకే కాకపోతే రెండో అంశానికి వెళ్లనుంది. మనుషుల ప్రమేయం లేకుండా సిస్టమే అన్నీ చేస్తుంది.
ప్రస్తుతం ఈ యాప్‌ను ట్రెజరీ విభాగంలో రిటైరైన ఉద్యోగుల పెన్షన్ పంపిణీ కోసం వినియోగిస్తున్నారు. రెండు మూడు నెలల్లో దీనిని ఈ విభాగంలో మరింతగా విస్తరించనున్నారు. మొత్తంగా ప్రభుత్వం తీసుకురాబోతున్న ఈ యాప్‌తో ప్రజలకు పరిపాలన మరింత సులభతరం కానుంది.