ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ఏపీ రాజకీయాల్లో కొత్త కొత్త చర్చలు తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా ఈసారి ఎన్నికలు జనసేన పార్టీకి అత్యంత కీలకమైన వేళ ఆ పార్టీ తరచూ వార్తల్లో నిలుస్తోంది. పార్టీ స్థాపించి పదేళ్ళు గడిచిన అధికారికంగా ఆ పార్టీకి ఎలాంటి గుర్తింపు లేదు. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ లకు కేవలం మద్దతుగానే నిలిచిన జనసేన.. 2019 ఎన్నికల్లో మాత్రం ఎలాంటి పొత్తు లేకుండా ఎన్నికల బరిలో నిలిచింది. అయితే ఆ ఎన్నికల్లో కేవలం ఒక్క అభ్యర్థి మినహా అధినేత పవన్ కూడా ఓటమి చవిచూశారు. దాంతో పార్టీ కేవలం నామమాత్రంగానే ఉంటూ వస్తోంది తప్పా అధికారిక పార్టీగా ఈసీ గుర్తించడం లేదు. అందువల్ల ఈసారి ఎలాగైనా సత్తా చాటి సొంత గుర్తింపు పొందాలని జేఎస్పీ భావిస్తోంది. .
అయితే అందులో భాగంగానే టీడీపీ బీజేపీ పార్టీలతో పొత్తు పెట్టుకొని 21 అసెంబ్లీ స్థానాలు 2 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయనుంది. అయితే ఎన్నికల ముందు జనసేన పార్టీకి కొత్త తలనొప్పులు చుట్టుముట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎలక్షన్ సింబల్ గా ఉన్న గాజు గ్లాసు విషయంలో ఆ పార్టీకి ఇబ్బందులు తప్పెలా లేవు. సాధారణంగా గుర్తింపు పొందిన పార్టీలకు మాత్రమే శాశ్వత ఎలక్షన్ గుర్తులను కేటాయిస్తుంది ఎన్నికల సంఘం. అయితే జనసేన సింబల్ గా ఉన్న గాజు గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్ జాబితాలో ఉంచింది.
అంటే ఈ గుర్తును జనసేన పార్టీతో పాటు ఇతరులు కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఇదే ఇప్పుడు ఆ పార్టీని ఇబ్బంది పెడుతున్న అంశం. అయితే గతంలో కూడా గాజు గ్లాసు విషయంలో ఎన్నికల సంఘం జేఎస్పీ కి ఇలా షాక్ ఇవ్వడం కొత్తేమీ కాదు.దీనిపై పార్టీ అధిష్టానం హైకోర్టును ఆశ్రయించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎన్నికల దగ్గర పడుతున్న వేళ మరోసారి గాజు గ్లాసు గుర్తు జనసేన పార్టీని కలవర పెడుతోంది. మరి ఆల్రెడీ ఫ్రీ సింబల్ జాబితాలో ఉన్న గాజు గ్లాసు గుర్తుతో జనసేన పార్టీ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొబోతుందో చూడాలి.
Also Read:Harishrao:రుణమాఫీ ఎప్పటిలోగా చేస్తారు?