పవర్‌ఫుల్‌ షెడ్యూల్‌లో సంబరాల ఏటిగట్టు

7
- Advertisement -

సాయి దుర్గతేజ్ హీరోగా తెరకెక్కుతున్న పాన్-ఇండియా పీరియడ్ యాక్షన్ డ్రామా సంబరాలఏటిగట్టు (SYG). తేజ్ కెరీర్ లో అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్‌గా దాదాపు రూ. 100 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. నిరంజన్ రెడ్డి -చైతన్య రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

SYG ఒక మహానాయకుని కథగా, ఇది భారతదేశ స్వాతంత్ర్య సమర సమయంలో జరిగిన వీరుడి పోరాటం నేపథ్యంలో తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఈ సినిమా రాయలసీమ వెనుకబాటు తనాన్ని, బ్రిటీష్ అధికారానికి వ్యతిరేకంగా పోరాడే ఓ ధైర్యవంతుడైన యువకుడి వీరత్వాన్ని చూపించనుందని తెలుస్తోంది.

Also Read:నేపాల్‌లో తీవ్ర రాజకీయ సంక్షోభం..

సెప్టెంబర్ నుంచి కీలకమైన, పవర్‌ఫుల్ షెడ్యూల్‌కు సిద్దమవుతోంది సంబరాల ఏటిగట్టు. ఈ షెడ్యూల్‌లో అద్భుతమైన యాక్షన్ సన్నివేశాన్ని ప్రముఖ స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్‌ కొరియోగ్రాఫ్ చేస్తున్నారు. ఇకపోతే, #SYG పోస్ట్-ప్రొడక్షన్ పనులు ఏకకాలంలోనే జరుగుతున్నాయి.

తారాగణం: సాయి దుర్గ తేజ్, ఐశ్వర్య లక్ష్మి, జగపతి బాబు, శ్రీకాంత్, సాయికుమార్, అనన్య నాగళ్ల, రవికృష్ణ

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: రోహిత్ KP,
నిర్మాతలు: K నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి
బ్యానర్: ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్
DOP: వెట్రి పళనిసామి
సంగీతం: బి అజనీష్ లోక్‌నాథ్
ఎడిటర్: నవీన్ విజయ కృష్ణ
ప్రొడక్షన్ డిజైనర్: గాంధీ నడికుడికర్
కాస్ట్యూమ్ డిజైనర్: అయేషా మరియం

- Advertisement -