- Advertisement -
సైరా టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. మెగా ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఆసరక్తిగా ఎదురుచూస్తున్న ‘సైరా’ మూవీ టీజర్ కొద్ది సేపటి క్రితమే రిలీజైంది. రిలీజైన కొన్ని క్షణాల్లోనే వేల హిట్స్ సంపాధించుకుంది సైరా టీజర్. ఈ మూవీ చిరంజీవి సతీమణి సురేఖ సమర్పణలో, రామ్ చరణ్ నిర్మాతగా వస్తోంది.
అయితే ఈ మూవీ టీజర్ లో బ్రిటీష్ వారి కోటను , ఆపై ఓ గ్రామంలో గుర్రపు బండ్లు వెళుతూ ఉండడం, ఓ భారతీయుడి వీపునే మెట్టుగా చేసుకుని బ్రిటీష్ అధికారి బండి దిగడాన్ని చూపారు. ఆపై అసలు సీన్ మొదలైంది. కాగా.. ఈ టిజర్ లోని సీన్స్ ఫ్యాన్స్ లో ఆసక్తిని పెంచుతున్నాయి. మొత్తానికి రిలీజైన కొద్ది క్షణాల్లోనే సోషల్ మీడియాలో సైరా టీజర్ వైరల్ అవడాన్ని చూస్తే.. సైరా కోసం ఫ్యాన్స్ ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో అర్థమవుతోంది. మరి సైరా టీజర్ పై మీరూ ఓ లుక్కేయండి.
- Advertisement -