చరిత్ర మనతోనే మొదలవ్వాలి…సైరా టీజర్

595
sye raa
- Advertisement -

మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చేసింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా మూవీ టీజర్ వచ్చేసింది. స్వాతంత్ర్య పోరాటం నేపథ్యంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేసిన పోరాటాన్ని టీజర్‌లో అద్భుతంగా చూపించారు. ఎవరీ నరసింహారెడ్డి అని బ్రిటిషర్ అనడం అతడో సింహాం అంటూ సాగే టీజర్‌ సూపర్బ్. చిరు గుర్రపు స్వారీ,యుద్దనేపథ్యంలో సాగే ఫైట్‌ సినిమాపై అంచనాలను మరింతగా పెంచేసింది. చరిత్రలో మనం ఉండకపోవచ్చు.. చరిత్ర మనతోనే మొదలవ్వాలి టీజర్ కే హైలైట్ గా నిలవగా పవన్ వాయిస్ ఓవర్ ఫ్యాన్స్ ని మరింతగా ఆకట్టుకుంటోంది.

కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ బ్యానర్‌లో హీరో రామ్ చ‌ర‌ణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బ‌చ్చ‌న్, విజ‌య్ సేతుప‌తి, సుదీప్‌, జ‌గ‌ప‌తి బాబు వంటి టాప్ స్టార్స్ నటిస్తుండటం సినిమాకు మరింత ఎట్రాక్షన్ తీసుకొచ్చింది. అక్టోబ‌ర్ 2న గాంధీ జ‌యంతి సందర్భంగా సినిమా విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం. టీజర్‌పై మీరు ఓ లుక్కేయండి..

- Advertisement -