సిడ్నీలో మళ్లీ లాక్ డౌన్ పొడగింపు..!

361
covid
- Advertisement -

కరోనా ప్రపంచ దేశాలను వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ముఖ్యంగా ఆస్ట్రేలియాలో కరోనా తీవ్రత ఏ మాత్రం తగ్గడం లేదు. దీంతో ఆ దేశ రాజధాని సిడ్నీలో నెలరోజుల పాటు లాక్‌డౌన్‌ను పొడగించారు.

న‌గ‌రంలో 50 ల‌క్ష‌ల మంది జ‌నాభా ఉన్నార‌ని, వారిని ర‌క్షించేందుకు ఈ చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని న్యూ సౌత్ వేల్స్ నేత గ్లాడిస్ బెర్జిక్లియ‌న్ తెలిపారు. దుర‌దృష్ట‌వ‌శాత్తు కేసుల సంఖ్య విప‌రీతంగా పెరుగుతున్న‌ట్లు ఆమె వెల్ల‌డించారు.

సిడ్నీలో ప్రస్తుతం రోజుకు 600కు పైగా క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి. సెప్టెంబ‌ర్ చివ‌ర వ‌ర‌కు స్టే ఎట్ హోమ్ ఆదేశాలు అమ‌లులో ఉంటాయన్నారు. హాట్‌స్పాట్ ప్రాంతాల్లో రాత్రిపూట క‌ర్ఫ్యూ ఉంటుందని అధికారులు వెల్లడించారు.

- Advertisement -