SBI డెబిట్ కార్డ్ మార్చుకోవాల్సిందే..

206
SBI
- Advertisement -

మీకు ఎస్‌బీఐ బ్యాంకులో అకౌంట్‌ ఉందా.. అయితే గీ ముచ్చట మీకోసమే.. మంచిగ ఇనుర్రీ… మీరు వెంటనే మీ బ్యాంకు అకౌంట్‌ ఉన్న బ్రాంచ్‌లకు పోయి మీ ఏటీఎం కార్డును మార్చుకోండి. ఈ అవకాశం డిసెంబర్‌ 31వరకే.. ఒకవేళ మీరు డిసెంబర్‌ 31 వరకు మీ బ్యాంకు ఏటీఎంను మార్చుకోకపోతే మీ డెబిట్‌ కార్డు పనిచేయదని ఎస్‌బీఐ బ్యాంకు ఖాతాదారులను హెచ్చరించింది.

SBI

తాజాగా వచ్చిన కొత్త రూల్‌ ప్రకారం ఎస్‌బీఐ బ్యాంకు తమ ఖాతాదారులకు చిప్‌ ఆదారిత ఈవీఎం కార్డులను తీసుకోవాలంటూ ఎస్‌బీఐ బ్యాంకు తమ ఖాతాదారులకు సూచించింది. మోసపూరిత లావాదేవీల నుంచి ఖాతాదారులకు భద్రత కల్పించేందుకు చిఫ్‌ ఆధారంగా పనిచేసే డెబిట్‌, క్రెడిట్‌ కార్డులను జారీ చేయాలంటూ దేశంలోని అన్ని బ్యాంకులకు రిజర్వ్‌ బ్యాంకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఎస్‌బీఐ తన ఖాతాదారులకు ఈ హెచ్చరికలు జారీ చేసింది. ఖాతాదారులు తమ ఏటీఎం కార్డులను మార్చుకోవడానికి ఎటువంటి రుసుము చెల్లించనవసరం లేదని తెలిపింది. కార్డు మార్చుకోవాల్సినవారు.. బ్యాంక్ ఖాతాలో సంప్రదించాల్సి ఉంటుంది. కార్డుకు, అందులో ఉన్న డబ్బుకు రక్షణ పెరుగుతుందని… ఖాతాదారులకు, బ్యాంకులకు టెన్షన్ తగ్గుతుందని బ్యాంక్ చెబుతోంది.

- Advertisement -