సినీనటి శ్వేతా బసు ప్రసాద్ పెళ్లి ఘనంగా జరిగింది. ఫిల్మ్‌మేకర్ రోహిత్ మిట్టల్‌తో గురువారం తెల్లవారు జామున వీరిద్దరి వివాహ వేడుక పుణెలో జరిగింది. మార్వాడీ, బెంగాలీ సంప్రదాయాల ప్రకారం వీరి ఘనంగా జరిగింది. ఇరువర్గాలకు చెందిన కుటుంబసభ్యులు మాత్రమే ఈ వివాహవేడుకకు హాజరయ్యారు.
పెళ్లికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో శేర్ చేసింది శ్వేత. ‘పెళ్లి అయిపోయింది’ అని క్యాప్షన్ ఇవ్వగా మంచిరెస్పాన్స్ వస్తోంది. పలువురు నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ వారంలో ముంబైలో రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.
కొత్తబంగారులోకం చిత్రంలో ఎ…క్క…డా అంటూ ఆకట్టుకుంది శ్వేతా. మొదటి సినిమాతోనే మంచి టాలెంటెడ్ ఆర్టిస్ట్ గా పేరుతెచ్చుకుంది.కానీ, అనూహ్య ఘటనలు ఈ భామను అగాధంలోకి నెట్టివేశాయి. ఆ ఘటనల నుంచి బయట పడి ముంబైలో మళ్లీ కొత్త జీవితాన్ని ప్రారంభించింది శ్వేతాబసు.
ప్రముఖ దర్శక-నిర్మాత అనురాగ్ కశ్యప్, తన నిర్మాణ సంస్థ ఫాంటమ్ ఫిల్మ్స్‌లో ఉద్యోగం ఇవ్వగా అక్కడ పనిచేసే అప్ కమింగ్ ఫిల్మ్‌మేకర్ రోహిత్ మిట్టల్‌తో శ్వేతాకు పరిచయమైంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడం రేండేళ్ళ నుండి డేటింగ్ చేస్తున్నారు. తాజాగా పెళ్లితో వీరిద్దరు ఒక్కటయ్యారు. ప్రస్తుతం పలు టీవీ సీరియల్స్‌లో నటిస్తోంది శ్వేతా.