బండి సంజయ్‌కు స్వేరోస్ మహిళ కార్యకర్త వార్నింగ్..!

264
BJP Chief Bandi Sanjay
- Advertisement -

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు స్వేరోస్ మహిళా సభ్యురాలు ఇచ్చిన వార్నింగ్‌ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గత కొద్ది రోజులుగా స్వేరోస్ సంస్థ వ్యవస్థాపకులు, తెలంగాణ గురుకులాల కార్యదర్శి ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌‌కు, తెలంగాణ బీజేపీ నేతలకు మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. పెద్దపల్లి జిల్లా ధూళికట్ట వద్ద బుద్ధుడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం సందర్భంగా స్వేరోస్ కార్యకర్తలు హిందూ మతాల దేవుళ్లను పూజించం అంటూ చేసిన ప్రతిజ్ఞ వీడియోపై దుమారం చేలరేగుతోంది. ఆ వీడియోలో తెలంగాణ గురుకులాల కార్యదర్శి, ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఉండడం రాజకీయ వివాదంగా మారింది. కేసీఆర్ సర్కార్ అండతో హిందూమత వ్యతిరేక కార్యక్రమాలను ప్రవీణ్‌కుమార్ నిర్వహిస్తున్నారంటూ బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు.

ప్రవీణ్‌కుమార్ స్థాపించిన స్వేరోస్ సంస్థకు నిధులు ఎక్కడ నుంచి వస్తున్నాయి.. 500 కోట్ల కుంభకోణంలో ప్రవీణ్‌కుమార్ పాత్ర ఉందని, స్వేరోస్ సంస్థ కార్యకలాపాలపై సీబీఐ విచారణ జరిపించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈక్రమంలో హుజూర్‌నగర్ పర్యటనకు వెళ్లిన బండి సంజయ్‌ కాన్వాయ్‌ను స్వేరోస్ సంస్థ సభ్యులు, ప్రవీణ్‌కుమార్ అభిమానులు, ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు అడ్డుకోవడంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి బండి సంజయ్‌ను క్షేమంగా హైదరాబాద్‌కు పంపించారు. గురుకులాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన పేద పిల్లలను అత్యుత్తమ విద్యాబోధనలు అందిస్తూ వారిని ఉన్నత స్థాయిలో తీర్చి దిద్దుతున్న ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌పై అడ్డగోలు విమర్శలు చేస్తున్న బండి సంజయ్‌పై స్వేరోస్ సభ్యులు మండిపడుతున్నారు.

ఈ నేపథ‌్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో స్వేరోస్ మహిళా సభ్యురాలు బండి సంజయ్‌కు వార్నింగ్ ఇచ్చిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. తెలంగాణలో అడ్డగోలుగా మాట్లాడుతూ మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ మత రాజకీయం చేస్తున్న బండి సంజయ్‌ దిష్టిబొమ్మ లను రాష్ట్రవ్యాప్తంగా స్వేరోస్ సభ్యులు తగలబెడుతున్నారు. మహిళలు, యువకులు, విద్యార్థులు బండి సంజయ్‌ను దుమ్ముదులుపుతున్నరు. ఐపీఎస్ అధికారి ఆర్ ప్రవీణ్‌కుమార్‌పై తప్పుడు ఆరోపణలు చేసిన తొండి సంజయ్ తాట తీస్తున్నారు.. మా చేతికికాని బండి సంజయ్ బయట దొరికితే..ఆడోళ్లంతా కలిసి చావబాదుతాం అని స్వేరోస్‌కు చెందిన ఓ మహిళా సభ్యురాలు వార్నింగ్ ఇచ్చారు. బండి సంజయ్ ఏడ ఉన్నవురా నువ్వు.. నువ్వు మీ అమ్మా, నాయినకే పుట్టినవా అంటూ మాటల్లో చెప్పలేని వ్యాఖ్యలు చేశారు. కేవలం రోజుకు 300లకు కూలీ పని చేసుకునే మహిళల దగ్గరకు వచ్చి మాట్లాడు..నీకు సమాధానం మేం చెబుతాం..నీకు స్వేరోస్ గురించి ఏం తెలుసు..ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సార్ గురించి ఏం తెలుసు..బిడ్డా నువ్వు కనపడితే నడిరోడ్డుపై పండబెట్టి తొక్కుతం అని ఆ మహిళా సభ్యురాలు బండి సంజయ్‌ను హెచ్చరించారు.

అసలు నువ్వు ఇస్కూల్‌కు పోయి చదువుకున్నవా..గాడిదలు కాసినవా మాకు అర్థం కావడం లేదు అంటూ ఆ మహిళ బండిపై విరుచుకుపడ్డారు. బడుగు, బలహీన వర్గాల జాతికి చెందిన మమ్మల్ని, మా పిల్లలను విద్యావంతులను చేస్తున్నారు..మా ప్రవీణ్ కుమార్ సారు..అలాంటి మా సారుపై అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునేది లేదని అన్నారు. బిడ్డా బండి..ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సార్‌కు క్షమాపణ చెప్పు లేకుంటే..నువ్వు మా కళ్లకు కనపడితే ఉర్కించి కొడతం..సచ్చిపోతవు బిడ్డా అంటూ ఆ స్వేరోస్ మహిళా సభ్యురాలు బండి సంజయ్‌‌కు దిమ్మతిరిగే వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు స్వేరోస్ మహిళా సభ్యురాలు ఇచ్చిన వార్నింగ్‌కు సంబధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రకంపనలు రేపుతోంది. మరి బండి సంజయ్‌కు, స్వేరోస్ సంస్థకు మధ్య నెలకొన్న ఈ వివాదం ఎంత వరకు దారి తీస్తుందో చూడాలి.

- Advertisement -