నేటి నుండే మన పల్లె.. మన పాలన

240
telangana sarpanches
- Advertisement -

మూడు విడతలుగా జరిగిన తెలంగాణ పల్లె పోరు ముగియడంతో నేటి నుంచి కొత్త సర్పంచ్‌లు కొలువుదీరనున్నారు. 12,751 గ్రామపంచాయతీల్లో 12,680 పంచాయతీలకు,1,13,152 వార్డులకు ఎన్నికలు పూర్తవగా గ్రామాల్లో పాలకవర్గ సభ్యులు అధికార పగ్గాలు చేపట్టనున్నారు. పంచాయతీ కార్యదర్శులు పాలకవర్గ మొదటి సమావేశాన్ని ఆయా పంచాయితీల్లో
నిర్వహించనున్నారు.

అనంతరం సర్పంచ్‌లు, వార్డు సభ్యులు పాలన బాధ్యతలను తీసుకొంటారు. ఈ సమావేశంలో ప్రత్యేక ఎజెండా ఏమి ఉండదు…కేవలం ప్రమాణ స్వీకారానికే ఈ సమావేశం పరిమితం కానుంది. ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ మేరకు పాలకవర్గాలు తొలి తీర్మానం చేయనున్నాయి.

భారతదేశం గ్రామాల్లో నివసిస్తున్నది. మన దేశానికి గ్రామాలే పట్టుకొమ్మలు. దేశ అభివృద్ధి గ్రామీణాభి వృద్ధిపై ఆధారపడి ఉన్నది. గ్రామస్వరాజ్యం ద్వారానే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందన్న మహాత్మాగాంధీ వ్యాఖ్యలు అక్షర సత్యాలు. ఆ అక్షర సత్యానికి కార్యరూపం దాల్చేందుకు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం – 2018ని రూపొందించి అమలు చేస్తున్నారు. కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలతో కలుపుకుని సుమారు 12 వేలకు పైగా గ్రామాలున్నాయి. ఈ గ్రామాల్లో పాలన కోసం 9,355 జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

పరిపాలన వికేంద్రీకరణ ద్వారా మారుమూల ప్రాంతాలకు, అణగారిన వర్గాలకు అభివృద్ధి ఫలాలను అందించాలన్న ఉద్దేశంతో జిల్లాలు, మండలాలు, గ్రామాల విభజనకు శ్రీకారం చుట్టారు. అభివృద్ధికి మూలబిందువైన గ్రామాలను మరింత బలోపేతం చేసేదిశగా కేసీఆర్ సర్కార్ అడుగులు వేస్తోంది.

- Advertisement -