- Advertisement -
తెలుగు బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్. ఇటీవల సీజన్ 4 ప్రారంభమైంది. ఫస్ట్ వీక్.. దర్శకుడు సూర్య కిరణ్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఆ తర్వాత నిన్న కరాటే కళ్యాణి కూడా బిగ్‌బాస్.. హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. ఈ రోజు మరో ఎలిమినేషన్ ప్రక్రియ ఉంది. అది ఎవరనేది ఈ రోజు ఎపిసోడ్‌లో తెలుస్తుంది.
అయితే షో ప్రారంభమైన వారం రోజులకే బిగ్‌బాస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా నటుడు కుమార్ సాయి, జబర్దస్త్ ముక్కు అవినాష్ ఎంట్రీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పడు వైల్డ్ కార్డ్ ఎంట్రీతో మరో సెలబ్రెటీ హౌస్‌లోకి అడుగుపెట్టబోతున్నట్లు సమాచారం. ఆమె ఎవరంటే.. అల్లరి నరేష్ జంప్ జిలానీలో హీరోయిన్‌గా నటించిన స్వాతి దీక్షిత్.. బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్టు సమాచారం. ఇది ఎంతవరకు నిజమన్నది నేటి ఎపిసోడ్ చూస్తే అర్థమౌతుంది.
- Advertisement -