పాయల్ వ్యాఖ్యలపై అనురాగ్ క్లారిటీ..

153
Anurag Kashyap

బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తనను బలవంతం చేశారని, ఓ గదిలోకి తీసుకెళ్లి దుస్తులు విప్పేందుకు ప్రయత్నించాడని నటి పాయల్ ఘోష్ సంచలన వ్యాఖ్యలు చేసింది. దీనిపై దర్శకుడు అనురాగ్ కశ్యప్ స్పందించారు. పాయల్ వ్యాఖ్యల అనంతరం తనకు చాలామంది నుంచి సందేశాలు, ఫోన్ కాల్స్ వస్తున్నాయని వెల్లడించారు. పాయల్ ఆరోపణల పట్ల స్పందించవద్దని చాలామంది సన్నిహితులు తనతో చెప్పారని, అయినప్పటికీ తాను జవాబు చెప్పడానికి ముందుకు వచ్చానని కశ్యప్ వివరించారు.

నా నోరుని మూసివేసే ప్ర‌య‌త్నం బాగానే జ‌రుగుతుంది. ఇన్నాళ్ళు సైలెంట్‌గా ఉండి ఇప్పుడు మాట్లాడుతున్నావు. అమ్మాయి అయిన నువ్వు ఇత‌ర అమ్మాయిల గురించి దారుణంగా మాట్లాడావు. దేనికైన ఒక లిమిట్ ఉంటుంది. నాపై చేసే ఆరోప‌ణ‌లు అన్నీ నిరాధారం. బ‌చ్చ‌న్ ఫ్యామిలీను కూడా ఇందులోకి లాగావు. నా మొద‌టి భార్య‌, రెండ‌వ భార్య లేదా నా ప్రేయ‌సిపై కూడా కామెంట్స్ చేశావు. మీరు మాట్లాడే వీడియో చూస్తే అర్ధ‌మ‌వుతుంది ఎంత నిజాలు మాట్లాడుతున్నావు అనేది అని అనురాగ్ తెలిపారు.