ప్రజలకు కష్టం రాకుండా చూసుకుంటా: స్వర్ణలత భవిష్యవాణి

51
rangam

వర్షాల వల్ల ప్రజలు కొంత ఇబ్బంది పడతారని అయినా వారికి ఎటువంటి కష్టం రాకుండా చూసుకుంటానని స్వర్ణలత అమ్మవారి భవిష్యవాణి చెప్పారు. సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతరలో భాగంగా రంగం చెప్పిన స్వర్ణలత….. కష్టమైనా తనకు పూజలు జరిపించినందుకు సంతోషంగా ఉన్నానన్నారు. కరోనాను తరిమేయాలని పూజారులు కోరగా… భక్తులను సంతోషంగా ఉండేలా చూసుకుంటానన్నారు. కష్టాల నుంచి కాపాడతానన్నారు.

ప్రజలు ధైర్యంగా ఉండాలని…. తాను ప్రజల వెంట ఉండి నడిపిస్తానన్నారు. నిరాశ చెందవద్దన్నారు. ఎంత పెద్ద ఆపద వచ్చినా… నేను చూసుకుంటానన్న అమ్మవారు… ఎలాంటి పరిస్థితుల్లోనూ భక్తులు ఆధైర్యపడవద్దని చెప్పారు.

ఆదివారం ఉజ్జయిని మహంకాళి అమ్మవాకి బోనాలు వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. వేలాది మంది భక్తులు అమ్మవారికి బోనాలు, సాక సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.