- Advertisement -
తిరుపతిలో ముంతాజ్ హోటల్‌కు వ్యతిరేకంగా స్వామిజీలు ధర్నా చేపట్టారు. తిరుపతిలో ఒబెరాయ్ గ్రూప్‌కు చెందిన హోటల్‌కు అనుమతించింది ప్రభుత్వం. దీంతో అప్పటినుండి ముంతాజ్ హోటల్స్ నిర్మాణానికి వ్యతిరేకంగా స్వామిజీలు ఆందోళనలు చేస్తున్నారు.
భూ కేటాయింపులు రద్దు చేయాలని, ఇప్పటివరకు నిర్మించిన భాగాలను కూల్చివేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలిపిరిలో దీక్ష ప్రారంభించిన స్వామిజీలు పాదయాత్రగా తిరుమలకు వెళ్లనున్నారు. కాగా తిరుపతి సమీపంలోని పేరూరు వద్ద 20 ఎకరాలను 60 ఏళ్ల పాటు లీజుకు ఇస్తూ 2022లో ప్రభుత్వం జీవో ఇచ్చింది.
Also Read:రాబిన్ హుడ్..అతిథిగా వార్నర్
- Advertisement -