హీరో శ్రీవిష్ణు, దర్శకుడు హసిత్ గోలి ‘రాజ రాజ చోర’ కంటే ఎక్కువ ఎంటర్ టైనింగ్ గా ఉండబోతున్న మరో ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ కోసం మళ్లీ కలిశారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. శ్రీవిష్ణుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మేకర్స్ సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేశారు.
సింహం నుండి కిరీటం తీసుకున్న తర్వాత కొత్త నాయకుడిని ఎన్నుకోవడం గురించి అడవిలో జంతువుల మధ్య ఫన్నీ సంభాషణను చూపే కాన్సెప్ట్ వీడియో ద్వారా టైటిల్ అనౌన్స్ చేశారు. సింహం పాత్రకు సునీల్ వాయిస్ ఓవర్ ఇవ్వగా, కోతి పాత్రకు గంగవ్వ వాయిస్ ఓవర్ ఇచ్చింది. చివరగా, టైటిల్ ‘శ్వాగ్’ అని రివీల్ అయ్యింది.
రాజుగా కనిపించిన శ్రీవిష్ణు కాన్సెప్ట్ వీడియోలో ”మగవాడి ఉనికిని నిలబెట్టిన మా శ్వాగణిక వంశానిది’ అని చెప్పిన డైలాగు ఆకట్టుకుంది.టీజర్, హిలేరియస్ కాన్సెప్ట్ వీడియోను బట్టి చూస్తే, శ్వాగ్ చిత్రం యూనిక్ కాన్సెప్ట్‌తో అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందని అర్ధమౌతోంది.
రాజ రాజ చోరా కోసం పనిచేసిన దాదాపు అదే టీమ్ ‘శ్వాగ్’ కోసం కూడా పని చేస్తుంది. వేదరామన్ శంకరన్ కెమెరా డీవోపీ పని చేస్తుండగా, వివేక్ సాగర్ సంగీతం సమకురుస్తున్నారు. విప్లవ్ నిషాదం ఎడిటర్. జిఎం శేఖర్ ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌ని చూస్తుండగా, నందు మాస్టర్ స్టంట్స్‌ని పర్యవేక్షిస్తున్నారు.ఈ సినిమాలో హీరోయిన్, ఇతర వివరాలు త్వరలోనే మేకర్స్ తెలియజేస్తారు.
Also Read:‘కన్నప్ప’తో రేంజ్ మారుతుందా ?